Telugu Global
National

ప్రధాని మోడీ చాయ్ అమ్మడం ఒక ఎన్నికల జిమ్మిక్.... ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ తాను రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మానని.. తనను తాను చాయ్ వాలాగా 2014 ఎన్నికల ముందు అభివర్ణించుకున్నారు. ఇప్పటికీ ఆయన చాయ్ వాలానని చెప్పుకుంటుంటారు. అయితే ఈ విషయాన్ని వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొట్టిపారేశారు. ఇదంతా మోడీ ఎన్నికల జిమ్మిక్ అని చెబుతున్నారు. తనకు మోడీతో 43 ఏళ్లుగా పరిచయం ఉందని…. అప్పటి నుంచి ఏనాడూ మోడీ చాయ్ అమ్మడం చూడలేదని స్పష్టం చేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఓటర్ల సానుభూతిని పొందడానికి […]

ప్రధాని మోడీ చాయ్ అమ్మడం ఒక ఎన్నికల జిమ్మిక్.... ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు
X

ప్రధాని నరేంద్ర మోడీ తాను రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మానని.. తనను తాను చాయ్ వాలాగా 2014 ఎన్నికల ముందు అభివర్ణించుకున్నారు. ఇప్పటికీ ఆయన చాయ్ వాలానని చెప్పుకుంటుంటారు. అయితే ఈ విషయాన్ని వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కొట్టిపారేశారు. ఇదంతా మోడీ ఎన్నికల జిమ్మిక్ అని చెబుతున్నారు.

తనకు మోడీతో 43 ఏళ్లుగా పరిచయం ఉందని…. అప్పటి నుంచి ఏనాడూ మోడీ చాయ్ అమ్మడం చూడలేదని స్పష్టం చేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఓటర్ల సానుభూతిని పొందడానికి మాత్రమే అలా చెప్పుకున్నారని తొగాడియా అంటున్నారు.

వచ్చే నెల 9న ఒక కొత్త పార్టీని ప్రకటించబోతున్నానని.. ఈ పార్టీ హిందువుల కోసమే పని చేస్తుందని తొగాడియా చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో మా పార్టీ గెలిచిన మరుసటి రోజు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తొగాడియా స్పష్టం చేశారు. రామాలయంపై ఆర్డినెన్స్ తేకపోవడం నరేంద్ర మోడీ వైఫల్యమేనని ఆయన విమర్శించారు.

ట్రిపుల్ తలాక్ చట్టం కోసం రేయింబవళ్లు పని చేసిన మోడీ రామాలయ నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని తొగాడియా ఆరోపించారు.

First Published:  22 Jan 2019 5:40 AM GMT
Next Story