Telugu Global
National

భార్యకు డబ్బివ్వడం ఇష్టం లేక ఉద్యోగానికి వైద్యుడు గుడ్‌బై....

సుప్రీం కోర్టు ముందుకు ఒక ఆసక్తికరమైన కేసు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విడాకుల సమయంలో భార్యకు భరణం చెల్లించాల్సి వస్తే … పేదరికంలో ఉన్నాం, దివాలా తీశామంటూ తప్పించుకుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భార్యకు భరణం ఇవ్వడం ఇష్టం లేక ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఓ కార్పొరేట్ వైద్యుడు కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక జంట విడాకుల కేసు […]

భార్యకు డబ్బివ్వడం ఇష్టం లేక ఉద్యోగానికి వైద్యుడు గుడ్‌బై....
X

సుప్రీం కోర్టు ముందుకు ఒక ఆసక్తికరమైన కేసు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విడాకుల సమయంలో భార్యకు భరణం చెల్లించాల్సి వస్తే … పేదరికంలో ఉన్నాం, దివాలా తీశామంటూ తప్పించుకుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భార్యకు భరణం ఇవ్వడం ఇష్టం లేక ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఓ కార్పొరేట్ వైద్యుడు కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక జంట విడాకుల కేసు సుప్రీం ముందుకొచ్చింది. భార్యకు గతంలో ప్రతి నెల రూ.15వేలు భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విడాకుల వ్యవహారంలో ఉన్న భర్త హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

ఉద్యోగం ఉన్న కారణంగా భార్యకు నెలకు రూ. 15వేలు భరణం ఇవ్వాల్సి వస్తోందని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సుప్రీం కోర్టు భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తోందన్న కారణంతో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అతడికి సూచించింది. అయినా ఈ రోజుల్లో 15వేలతో ఒక మహిళ తన పిల్లలతో కలిసి జీవించడం సాధ్యమేనా అని బెంచ్ ప్రశ్నించింది.

రూ. 15వేల భరణం చెల్లింపుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలన్న భర్త విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. భరణం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. అయితే తన భర్త వైద్యుడని… నెలకు 80వేల జీతంతో పాటు, ఇంటి అద్దెలు, వ్యవసాయ భూముల ద్వారా నెలకు మరో రెండు లక్షలకు పైగా ఆదాయం వస్తోందని… కాబట్టి లక్షా 10వేలు భరణం ఇచ్చేలా చూడాలని భార్య డిమాండ్ చేస్తోంది.

First Published:  22 Jan 2019 8:17 PM GMT
Next Story