ఆశ్చర్యంగా జీరో కట్‌తో ”యూ” సర్టిఫికేట్‌

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టాన్ని ప్రధానంగా చేసుకుని నిర్మించిన యాత్ర సినిమాకు సెన్సార్‌ బోర్డు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎలాంటి కట్‌లు చెప్పకుండా ఓకే చేసింది. యాత్ర చిత్రానికి యూ సర్టిఫికేట్‌ను సెన్సార్ జారీ చేసింది.

ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు…. చిత్ర యూనిట్‌ను అభినందించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉండడంతో అభ్యంతరాలు, సెన్సార్ కట్‌లు ఉంటాయని భావించారు. కానీ యాత్ర ఎలాంటి కట్‌లు లేకుండా క్లీన్ సర్టిఫికేట్‌ను సాధించింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు మహి.వి. రాఘవ తెరకెక్కించారు. చిత్రంలో వైఎస్‌ పాత్రను మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి పోషించారు. ప్రతిష్టాత్మకంగా తెర కెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.