విక్టరీ వెంకటేష్ కి ఆపరేషన్

“గురు” తరువాత దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విక్టరీ వెంకటేష్ కే మంచి హిట్ ని తెచ్చి పెట్టింది.

ఇక ఈ సినిమా సక్సెస్ ని కొన్ని రోజుల పాటు హైదరబాద్ లో ఎంజాయ్ చేసిన వెంకీ ఇప్పుడు ఒక చిన్న ఆపరేషన్ కోసం వైజాగ్ కి వెళ్ళాడు. ప్రస్తుతం వైజాగ్ లోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు వెంకటేష్.

59 సంవత్సరాల వెంకటేష్ గత కొన్ని నెలలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స పూర్తయిన తరువాత విక్టరీ వెంకటేష్ “వెంకీ మామ” సినిమా షూటింగ్ కి అటెండ్ అవుతాడు. ఈ సినిమా మార్చి నుంచి షూటింగ్ కి వెళ్ళే ప్లాన్ లో ఉంది.

ఇదిలా ఉంటే వైజాగ్ లో ఇప్పటికే రామానాయుడు స్టూడియోస్ ని కట్టించి అక్కడ కూడా సురేష్ బాబు షూటింగ్ జరిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.