Telugu Global
NEWS

లైంగిక దాడి... నటి భానుప్రియపైనా కేసు

సీనియర్ నటి భానుప్రియపై కేసు నమోదు అయింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఈ కేసు నమోదు అయింది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి తల్లి ఈ కేసు పెట్టింది. తన 14 ఏళ్ల కుమార్తెను భాను ప్రియ, ఆమె కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై లైంగిక దాడి చేశాడని… కుమార్తెను చూపించాల్సిందిగా కోరుతున్నా ఏడాదిగా బయటకు రానివ్వడం లేదని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో వివరించింది. గట్టిగా మాట్లాడితే చోరీ […]

లైంగిక దాడి... నటి భానుప్రియపైనా కేసు
X

సీనియర్ నటి భానుప్రియపై కేసు నమోదు అయింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఈ కేసు నమోదు అయింది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి తల్లి ఈ కేసు పెట్టింది.

తన 14 ఏళ్ల కుమార్తెను భాను ప్రియ, ఆమె కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై లైంగిక దాడి చేశాడని… కుమార్తెను చూపించాల్సిందిగా కోరుతున్నా ఏడాదిగా బయటకు రానివ్వడం లేదని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో వివరించింది.

గట్టిగా మాట్లాడితే చోరీ కేసు పెడుతామని బెదిరిస్తున్నారని బాధితురాలి తల్లి ప్రభావతి చెబుతున్నారు. చెన్నైలోని భానుప్రియ ఇంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రభావతి తన 14ఏళ్ల కుమార్తెను పనికి ఉంచింది.

తన కుమార్తెను భానుప్రియ కుటుంబసభ్యులు వేధిస్తున్నారని… తన కుమార్తెపై భానుప్రియ సోదరుడు లైంగిక దాడి కూడా చేశారని ప్రభావతి చెబుతోంది. ఏడాది నుంచి అడుగుతున్నా తన కుమార్తెను చూపించడం లేదని పోలీసులకు ఆమె వివరించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు… చెన్నైలోని చైల్ట్‌ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారం అందించారు.

First Published:  24 Jan 2019 5:04 AM GMT
Next Story