జగన్‌ వైఖరి నచ్చకే బయటకొచ్చా…

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు.

పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆదిశేషగిరిరావు… జగన్‌ వైఖరి నచ్చకే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు బాగా ఉన్నాయన్నారు. సీఎంగా చంద్రబాబే మరోమారు ఉంటారన్నది తన అభిప్రాయం అని చెప్పారు.