Telugu Global
NEWS

జర్నలిస్టును కొట్టిన జలీల్ ఖాన్

విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జర్నలిస్ట్ పై దాడి చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ ముందు ఈ ఘటన జరిగింది. ఒక కేసు విషయంలో జలీల్ ఖాన్ .. సీపీ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక చానల్ వీడియో జర్నలిస్టుపై జలీల్ ఖాన్, ఆయన అనుచరులు దాడి చేశారు. కెమెరా లాక్కున్నారు. వీడియో జర్నలిస్టును జలీల్ ఖాన్ అనుచరులు తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయడంతో స్వయంగా […]

జర్నలిస్టును కొట్టిన జలీల్ ఖాన్
X

విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జర్నలిస్ట్ పై దాడి చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ ముందు ఈ ఘటన జరిగింది. ఒక కేసు విషయంలో జలీల్ ఖాన్ .. సీపీ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక చానల్ వీడియో జర్నలిస్టుపై జలీల్ ఖాన్, ఆయన అనుచరులు దాడి చేశారు.

కెమెరా లాక్కున్నారు. వీడియో జర్నలిస్టును జలీల్ ఖాన్ అనుచరులు తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయడంతో స్వయంగా డీసీపీ నవాబ్ జాన్… కెమెరాలోని దృశ్యాలను డీలేట్ చేశారు. దాడి నుంచి జర్నలిస్టును రక్షించాల్సిందిపోయి డీసీపీ కూడా ఎమ్మెల్యేకి జీహుజూర్ అనడంపై విమర్శలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సోదరుడి కోడలు ఇటీవల కేసు పెట్టారు. భర్త చనిపోయిన నేపథ్యంలో తన నెలల బిడ్డను ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మనుషులు ఎత్తుకెళ్లారని కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో సీపీ కార్యాలయానికి వచ్చిన జలీల్ ఖాన్ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుండగా దాడి చేశారు. బండ బూతులు తిట్టారు.

First Published:  24 Jan 2019 4:22 AM GMT
Next Story