Telugu Global
NEWS

రంగాను చంపింది టీడీపీ వాళ్లని ఆవేశంలో అన్నా....

వంగవీటి రంగాను టీడీపీ వాళ్లే హత్య చేశారని గతంలో ఆవేశంలో తాను అన్నానని వాటి ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రంగా అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని… వారిని కలిసినప్పుడు కొందరు వ్యక్తులు చేసిన రంగా హత్యను అందరికీ ఆపాదించడం సరికాదు కదా అని వాళ్ళు అనేవారన్నారు. అది నిజమే అనిపించిందన్నారు. కొందరు వ్యక్తులు చేసిన పనిని పార్టీ మొత్తానికి ఆపాదించడం ద్వారా రంగా విగ్రహావిష్కరణకు వచ్చిన వారిని కూడా ఇబ్బందిపెట్టానేమే అనిపించిందన్నారు. రంగా కుటుంబాన్ని ఒక […]

రంగాను చంపింది టీడీపీ వాళ్లని ఆవేశంలో అన్నా....
X

వంగవీటి రంగాను టీడీపీ వాళ్లే హత్య చేశారని గతంలో ఆవేశంలో తాను అన్నానని వాటి ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రంగా అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని… వారిని కలిసినప్పుడు కొందరు వ్యక్తులు చేసిన రంగా హత్యను అందరికీ ఆపాదించడం సరికాదు కదా అని వాళ్ళు అనేవారన్నారు. అది నిజమే అనిపించిందన్నారు. కొందరు వ్యక్తులు చేసిన పనిని పార్టీ మొత్తానికి ఆపాదించడం ద్వారా రంగా విగ్రహావిష్కరణకు వచ్చిన వారిని కూడా ఇబ్బందిపెట్టానేమే అనిపించిందన్నారు.

రంగా కుటుంబాన్ని ఒక వ్యవస్థగా భావించారు కాబట్టే టీడీపీ వాళ్లు ఆహ్వానించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా తనను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. తన తండ్రి ఆశయమే తనకు ముఖ్యమని….ముఖ్యమంత్రి ఒక పెద్దమనిషిగా తనను ఆహ్వానించారని… దాన్ని తప్పుగా భావించకుండా మన్నించాలని అభిమానులను కోరారు.

తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని చంద్రబాబు కోరుతున్నానని… దయ ఉంచి విజయవాడలోని కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సిందివగా విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి ఆశయాల కోసం వైసీపీలో ఎన్నో భరించానని చెప్పారు వంగవీటి రాధా. జగన్‌ తన పద్దతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలన్నారు.

సోషల్‌ మీడియాలో దాడి చేస్తే పారిపోయే వ్యక్తిని తాను కాదన్నారు. వైసీపీ వాళ్లే రకరకాలుగా సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనను చంపినా భయపడేవాడిని కాదన్నారు. ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసి తనపై పోస్టులు పెడుతున్న వారి ఐపీ అడ్రస్‌లు వెలికితీయాల్సిందిగా కోరితే అన్ని బయటకు వస్తాయన్నారు. తాను చెప్పిందే సర్వం, తాను చెప్పిందే వేదం అన్న వైఖరి జగన్‌ది అని విమర్శించారు.

First Published:  24 Jan 2019 1:44 AM GMT
Next Story