కృష్ణా జిల్లాలో దారుణం… రెండో తరగతి చిన్నారిపై హెడ్‌మాస్టర్‌ అత్యాచారం

కృష్ణా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రెండో తరగతి చదువుతున్న అమ్మాయిపై స్కూల్ హెడ్‌మాస్టర్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లడంతో విషయం బయటపడింది. హెడ్‌మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలిక వయసు ఎనిమిది సంవత్సరాలు. చిన్నారిని ఎవరూ లేని గదిలోకి తీసుకెళ్లి హెడ్‌మాస్టర్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్రంగా రక్తస్రావంతో ఇంటికి వచ్చిన చిన్నారి… జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి నాలుగు కుట్లు వేశారు. తొలుత పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు చిన్నారి తల్లి సాహసించలేదు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు చిన్నారిని పరామర్శించి… ఆమె తల్లికి ధైర్యం చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఒప్పించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్కూల్ హెడ్‌మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. చిన్నారిపై అఘాయిత్వానికి ఒడిగట్టిన హెడ్‌మాస్టన్‌ను ఉద్యోగం నుంచి తక్షణం తొలగించినట్టు జిల్లా విద్యాధికారి ప్రకటించారు.