Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ తో సినిమా వదులుకున్న అనిల్ రావిపూడి

ఇటీవలే “ఎఫ్ 2” సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ పనుల్లో బిజీగా ఉంటూనే మరో వైపు మీడియా ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అనిల్. ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం చేతులారా మిస్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. అసలు విషయంలోకి వెళ్తే “పటాస్” లాంటి […]

ఎన్టీఆర్ తో సినిమా వదులుకున్న అనిల్ రావిపూడి
X

ఇటీవలే “ఎఫ్ 2” సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ పనుల్లో బిజీగా ఉంటూనే మరో వైపు మీడియా ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అనిల్.

ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం చేతులారా మిస్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

అసలు విషయంలోకి వెళ్తే “పటాస్” లాంటి హిట్ తరువాత అనిల్ ఒక మంచి మాస్ పాయింట్ ని తీసుకొని ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళాడట. లైన్ నచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాని కథ రూపంలో చేసి అతి త్వరలో తీసుకురమ్మని పంపించాడట.

అయితే తక్కువ టైం లో స్క్రిప్ట్ ని పూర్తి చేయలేను…. ఎక్కువ సమయమే కావాలని చెప్పి ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకొన్నాడట అనిల్ రావిపూడి. ఒకవేళ అప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గాని ఒక సినిమా పడి ఉంటే ఈ పాటికి ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మంచి మాస్ హిట్ సినిమా ఉండేది.

First Published:  24 Jan 2019 11:41 PM GMT
Next Story