Telugu Global
NEWS

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో టైటిల్ ఫైట్

జపాన్ వండర్ కు చెక్ థండర్ సవాల్ నువ్వానేనా అంటున్న ఒసాకా, క్విటోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది.  మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగే ఫైనల్లో…జపాన్ వండర్ నవోమీ ఒసాకాకు…చెక్ థండర్ పెట్రా క్విటోవా సవాలు విసురుతోంది. ఐదేళ్ల తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరిన క్విటోవాకు….4వ సీడ్ ఒసాకా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. 2019 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ […]

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో టైటిల్ ఫైట్
X
  • జపాన్ వండర్ కు చెక్ థండర్ సవాల్
  • నువ్వానేనా అంటున్న ఒసాకా, క్విటోవా

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగే ఫైనల్లో…జపాన్ వండర్ నవోమీ ఒసాకాకు…చెక్ థండర్ పెట్రా క్విటోవా సవాలు విసురుతోంది.

ఐదేళ్ల తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరిన క్విటోవాకు….4వ సీడ్ ఒసాకా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

2019 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లైనప్ పూర్తయ్యింది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ పెట్రా క్విటోవా, జపాన్ సంచలనం నవోమీ ఒసాకా..అందరి అంచనాలు తలకిందులు చేసి…. టైటిల్ ఫైట్ కు అర్హత సంపాదించారు.

తొలిసారి ఫైనల్లో ఒసాకా…

ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో …4వ సీడ్ గా బరిలోకి దిగిన ఒసాకా…తొలిరౌండ్ నుంచి స్థాయికి తగ్గట్టుగా ఆడి సెమీఫైనల్స్ కు అలవోకగా చేరుకొంది. అయితే…ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీస్ పోరులో మాత్రం…కారోలినా ప్లిసికోవా నుంచి గట్టి పోటీ ఎదుర్కొని మూడుసెట్ల పోరులో విజేతగా నిలిచింది.

నిప్పులు చెరిగే మెల్బోర్న్ ఎండవేడిమి వాతావరణంలో…నువ్వానేనా అన్నట్లుగా సాగిన రెండో సెమీఫైనల్లో 4వ సీడ్ ఒసాకా 6-2, 4-6, 6-4తో 7వ సీడ్ ప్లిసికోవాను అధిగమించింది.

తొలిసెట్ ను 6-2తో సునాయాసంగా నెగ్గిన ఒసాకా…రెండో సెట్ ను మాత్రం 4-6తో చేజార్చుకొంది. అయితే …నిర్ణయాత్మక మూడోసెట్ తొలిగేమ్ నుంచి పట్టుగా ఆడి ఓదశలో 4-2తో పైచేయి సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరిన జపాన్ తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

గత ఏడాది జరిగిన అమెరికన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా…ప్రపంచ మహిళా టెన్నిస్ లోకి దూసుకొచ్చిన ఒసాకా…ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ కు సైతం చేరడం ద్వారా తన సత్తా చాటుకోగలిగింది.

ఐదేళ్ల తర్వాత ఫైనల్లో క్విటోవా….

అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో….చెక్ జెయింట్ పెట్రా క్విటోవా…అమెరికన్ అన్ సీడెడ్ ప్లేయర్ కోనెల్లీ సంచలన విజయాల పరంపరకు తెరదించింది.

తొలిసెట్ ను 7-6తో టై బ్రేక్ లో సొంతం చేసుకొన్న క్విటోవాకు….రెండో సెట్లో ఏమాత్రం పోటీలేకుండా పోయింది. డబుల్ బ్రేక్ తో 6-0తో సెట్ , మ్యాచ్ నెగ్గడం ద్వారా…క్విటోవా….ఐదేళ్ల విరామం తర్వాత… ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరగలిగింది.

గత ఏడాది స్వదేశంలోని తన ఇంటిపై దొంగలు దాడి చేసిన సమయంలో చేతికి తీవ్రగాయమై…ఆరుమాసాలపాటు టెన్నిస్ కు దూరమైన క్విటోవా…పూర్తి ఫిట్ నెస్ సాధించిన తర్వాత పాల్గొన్న తొలిటోర్నీ… ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రమే.

టైటిల్ నెగ్గితే భారీ ప్రైజ్ మనీ….

4వ సీడ్ ఒసాకాతో జరిగే టైటిల్ సమరంలో క్విటోవా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. అయితే…ఇద్దరూ సమాన బలం కలిగిన ప్రత్యర్థులు కావడంతో …పోటీ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు…ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ…ఎవరి సొంతమవుతుందన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  24 Jan 2019 8:45 PM GMT
Next Story