ఈబీసీ కోటాపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మోడీ సర్కార్ తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు పరిశీలించింది.

మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈబీసీ కోటాపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఈబీసీ కోటాపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు సమ్మతించలేదు.

పిటిషన్ల తీవ్రత దృష్ట్యా  వీటిని విచారిస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ స్పష్టం చేశారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి మూడు వారాల గడువు ఇస్తూ కేసు విచారణను వాయిదా వేశారు చీఫ్ జస్టిస్.