నేను మోడీతో పోరాడతాను… కాని ద్వేషించను

దేశ ప్రధాని నరేంద్ర మోడీని తాను ద్వేషించనని…. కాకపోతే ఆయన నిర్ణయాల్లో చాలా వాటిని వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఆయన పలు రంగాల్లోని మేధావులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మోడీని పలు విషయాల్లో నేను వ్యతిరేకిస్తాను…. అలాగే ఆయన కూడా నన్ను వ్యతిరేకిస్తారు. పలు కారణాలతో ఆయనతో పోరాడతాను తప్ప ద్వేషించనని రాహుల్ చెప్పారు.

ఆర్ఎస్ఎస్ ప్రభావం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని…. దాంతోనే వారి భావజాలాన్ని పలు రాజ్యాంగబద్ద సంస్థలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.