Telugu Global
NEWS

రాధా... చెన్నుపాటి వారసుడే, విధ్వంసానికి బాధ్యత వహించాలి " కాపు కురువృద్ధుడు చెంచల్‌రావు

తన తండ్రి వంగవీటి రంగా హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేదని రాధా చేసిన వ్యాఖ్యలపై కాపు నేత, రంగా కుటుంబానికి సన్నిహితుడు అయిన చెంచల్‌ రావు మండిపడ్డారు. ఒక చానల్‌తో మాట్లాడిన ఆయన… రంగా హత్య సమయంలో రాధా తమ ఇంట్లోనే ఆశ్రయం పొందాడని గుర్తు చేశారు. రంగా కుటుంబాన్ని తమ ఇంట్లో పెట్టుకుని రక్షణ కల్పించామన్నారు. ఇప్పుడు రంగా హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేదని రాధా చేసిన ప్రకటన శతాబ్దంలోనే అతి పెద్ద […]

రాధా... చెన్నుపాటి వారసుడే, విధ్వంసానికి బాధ్యత వహించాలి  కాపు కురువృద్ధుడు చెంచల్‌రావు
X

తన తండ్రి వంగవీటి రంగా హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేదని రాధా చేసిన వ్యాఖ్యలపై కాపు నేత, రంగా కుటుంబానికి సన్నిహితుడు అయిన చెంచల్‌ రావు మండిపడ్డారు. ఒక చానల్‌తో మాట్లాడిన ఆయన… రంగా హత్య సమయంలో రాధా తమ ఇంట్లోనే ఆశ్రయం పొందాడని గుర్తు చేశారు.

రంగా కుటుంబాన్ని తమ ఇంట్లో పెట్టుకుని రక్షణ కల్పించామన్నారు. ఇప్పుడు రంగా హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేదని రాధా చేసిన ప్రకటన శతాబ్దంలోనే అతి పెద్ద తప్పు అవుతుందన్నారు. రంగా హత్య తర్వాత అమాయక ప్రజలను రెచ్చగొట్టడం వల్ల జరిగిన విధ్వంసానికి తామే కారణమని రాధా అంగీకరించినట్టు అయిందన్నారు. రాధా చెప్పిందే నిజమైతే … రంగా హత్య తర్వాత జరిగిన విధ్వంసానికి రాధా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

రంగా హత్య తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టానికి రాధా బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. రంగాను చంపింది టీడీపీ వాళ్లు కాకపోతే నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావును పదవి నుంచి ఎందుకు తప్పించారని చంచల్‌రావు ప్రశ్నించారు. రాధా తన స్వార్థం కోసం 30ఏళ్ల తర్వాత రంగా హత్య అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రస్తుతం రాధాను వంగవీటి వారసుడిగా చాలా మంది అంగీకరించలేకపోతున్నారని చెప్పారు.

రాధాను చెన్నుపాటి రత్నకుమారి వారసుడిగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో రంగా హత్య తర్వాత రత్నకుమారి టీడీపీలోకి వెళ్లిన సమయంలో తాము వంగవీటి వారసులం కాదు… చెన్నుపాటి వారసులం అని బహిరంగంగానే చెప్పారని చంచల్‌రావు గుర్తు చేశారు.

నాటి పత్రికలను తిరగేస్తే ఆ ప్రకటన కూడా చూడవచ్చు అన్నారు. ఇప్పుడు రాధా కూడా చెన్నుపాటి రత్నకుమారి వారసుడిగానే వ్యవహరిస్తున్నారని కాపునాడు నేత చెంచల్‌ రావు మండిపడ్డారు.

First Published:  24 Jan 2019 11:07 PM GMT
Next Story