Telugu Global
NEWS

న్యూజిలాండ్ తో మహిళ వన్డే సిరీస్ లోనూ భారత్ దే గెలుపు

తొలివన్డేలో 9 వికెట్లతో భారత్ అలవోక విజయం న్యూజిలాండ్ 192 ఆలౌట్, భారత్ వికెట్ కు 193 పరుగులు స్మృతి మంథానా 105, జెమీమా రోడ్రిగేజ్ 81 నాటౌట్ మొదటి వికెట్ కు భారత ఓపెనర్లు 190 పరుగుల భాగస్వామ్యం న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో… మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు 9 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది. నేపియర్ లోని మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలివన్డేలో… టాస్ […]

న్యూజిలాండ్ తో మహిళ వన్డే సిరీస్ లోనూ భారత్ దే గెలుపు
X
  • తొలివన్డేలో 9 వికెట్లతో భారత్ అలవోక విజయం
  • న్యూజిలాండ్ 192 ఆలౌట్, భారత్ వికెట్ కు 193 పరుగులు
  • స్మృతి మంథానా 105, జెమీమా రోడ్రిగేజ్ 81 నాటౌట్
  • మొదటి వికెట్ కు భారత ఓపెనర్లు 190 పరుగుల భాగస్వామ్యం

న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో… మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు 9 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది.

నేపియర్ లోని మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలివన్డేలో… టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను భారత్ 192 పరుగులకే కుప్పకూల్చింది.

భారత స్పిన్ జోడీ ఏక్తా బిస్త్, పూనం యాదవ్ లను కివీ టాపార్డర్ దీటుగా ఎదుర్కొనలేకపోయింది. సమాధానంగా..193 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు స్మృతి మంథానా, జెమీమా రోడ్రిగేస్…రికార్డుస్థాయిలో మొదటి వికెట్ కు 32.2 ఓవర్లలోనే 190 పరుగులతో అద్దిరిపోయే భాగస్వామ్యం అందించారు.

స్మృతి మంథానా 104 బాల్స్ లో 3 సిక్సర్లు, 9 బౌండ్రీలతో 105 పరుగులు సాధించగా….జెమీమా రోడ్రిగేజ్ 81పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

18 ఏళ్ల రోడ్రిగేజ్ కెరియర్ లో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే అర్థశతకం కావడం విశేషం. సిరీస్ లోని రెండో వన్డే ఈనెల 29న మౌంట్ మాంగనీ ..బే ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతుంది.

First Published:  24 Jan 2019 8:01 PM GMT
Next Story