తేజ సినిమా టైటిల్ – సీత

ఎట్టకేలకు తేజ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. అంతా అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దర్శకుడు తేజ, ఈ సినిమా టైటిల్ లోగోను తన ఫేస్ బుక్ ఖాతాలో విడుదల చేశాడు. అంతేకాదు, రేపు సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టైటిల్ ఫిక్స్ అయితే ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని ఇన్నాళ్లు ఆగారు. ఎట్టకేలకు ఆ టైటిల్ ఫిక్స్ అవ్వడంతో రేపట్నుంచి అఫీషియల్ గా ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ పేరు సీత.

ఏకే ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.