Telugu Global
Cinema & Entertainment

ఎమోషనల్ సీన్ తో స్టార్ట్ అవ్వనున్న "యాత్ర"

తెలుగు లో బయోపిక్స్ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం పై కూడా ఒక బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. తెలుగు బాషలో వస్తున్న ఈ బయోపిక్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉన్న ఈ సినిమా ఓపెనింగ్ సీన్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ […]

ఎమోషనల్ సీన్ తో స్టార్ట్ అవ్వనున్న యాత్ర
X

తెలుగు లో బయోపిక్స్ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం పై కూడా ఒక బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. తెలుగు బాషలో వస్తున్న ఈ బయోపిక్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉన్న ఈ సినిమా ఓపెనింగ్ సీన్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మొదలవుతుందట.

“యడుగురి సందిటి రాజశేఖర రెడ్డి అనే నేను…” అంటూ ప్రమాణస్వీకారం పూర్తవడంతో నే మమ్ముట్టి నిద్రలో నుంచి లేస్తాడట. అంటే ఆ ప్రమాణ స్వీకారం ఒక కల అన్నమాట. ఈ సీన్ లో మమ్ముట్టి చాలా బాగా నటించాడని, ఈ సీన్ నుంచే మమ్ముటి తన యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్ళిపోతాడు అని డైరెక్టర్ మహి వి రాఘవ్ చెప్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ తో బయటకి వచ్చిన ‘యాత్ర’ ఫిబ్రవరి 8 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. 70 ఎం ఎం ఎంటర్ టైన్ మెంట్స్ పై విజయ్, శశి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  24 Jan 2019 10:01 PM GMT
Next Story