Telugu Global
NEWS

ధోని ముందు ఇక మిగిలింది సచిన్, రాహుల్‌ రికార్డే

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని మరో రికార్డును నెలకొల్పారు. అత్యధిక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన మూడో భారతీయుడిగా ధోని రికార్డు నెలకొల్పారు. ధోని కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లుగా సచిన్, ద్రావిడ్‌ మాత్రమే ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడం సాధ్యం కాకపోవచ్చునేమో గానీ… త్వరలోనే రాహుల్ ద్రావిడ్ రికార్డును కూడా ధోని బ్రేక్ చేయడం ఖాయం. సచిన్ టెండుల్కర్ తన కేరీర్‌లో మొత్తం 463 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత […]

ధోని ముందు ఇక మిగిలింది సచిన్, రాహుల్‌ రికార్డే
X

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని మరో రికార్డును నెలకొల్పారు. అత్యధిక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన మూడో భారతీయుడిగా ధోని రికార్డు నెలకొల్పారు. ధోని కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లుగా సచిన్, ద్రావిడ్‌ మాత్రమే ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడం సాధ్యం కాకపోవచ్చునేమో గానీ… త్వరలోనే రాహుల్ ద్రావిడ్ రికార్డును కూడా ధోని బ్రేక్ చేయడం ఖాయం.

సచిన్ టెండుల్కర్ తన కేరీర్‌లో మొత్తం 463 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ద్రావిడ్ 340 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు 334 మ్యాచ్‌లు ఆడిన వ్యక్తిగా మూడో స్థానం అజారుద్దీన్‌ పేరున ఉండేది. శనివారం న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ధోని … అజార్‌ రికార్డును సమం చేశాడు.

2004లో ఆరంగేట్రం చేసిన ధోని ఇప్పటి వరకు 334 మ్యాచ్‌లు ఆడడం ద్వారా ఆజార్‌ రికార్డును సమం చేశారు. ధోని మరి కొంత కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండడంతో ద్రావిడ్ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ధోని 10వేల 414 పరుగులు చేశాడు.

First Published:  26 Jan 2019 5:34 AM GMT
Next Story