Telugu Global
National

గోవా బీచ్ లో మద్యం సేవించారో.... అంతే సంగతులు!

గోవా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గోవా బీచుల్లో బహిరంగంగా మద్యం తాగినా… వంటలు వండినా 2వేల రూపాయల జరిమానా విధించనున్నారు. దీనికోసం పర్యాటక చట్టాల్లో చేసిన మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గోంకర్ చెప్పారు. గోవాకు వచ్చే టూరిస్టుల్లో కొద్దిమంది పలిగిన మద్యం సిసాల్ని బీచ్ లో విసిరివేయడం…అక్కడే వంటలు కూడా వండుతున్నారన్నారు. దీనిని నిషేధించాలన్న […]

గోవా బీచ్ లో మద్యం సేవించారో.... అంతే సంగతులు!
X

గోవా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గోవా బీచుల్లో బహిరంగంగా మద్యం తాగినా… వంటలు వండినా 2వేల రూపాయల జరిమానా విధించనున్నారు. దీనికోసం పర్యాటక చట్టాల్లో చేసిన మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గోంకర్ చెప్పారు. గోవాకు వచ్చే టూరిస్టుల్లో కొద్దిమంది పలిగిన మద్యం సిసాల్ని బీచ్ లో విసిరివేయడం…అక్కడే వంటలు కూడా వండుతున్నారన్నారు. దీనిని నిషేధించాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు.

బీచ్ లలో మద్యం సేవించడం, బీచ్ లకు మద్యం సీసాలు తీసుకెళ్లేందుకు అనుమతించమని చెప్పారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లయితే రెండువేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు.

First Published:  25 Jan 2019 9:09 PM GMT
Next Story