కండువా కప్పుకున్న గోరంట్ల మాధవ్‌

మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌ వైసీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

ఇటీవలే గోరంట్ల మాధవ్‌ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన్ను వైసీపీ హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి బరిలో దింపుతుందన్న ప్రచారం జరుగుతోంది. గోరంట్ల మాధవ్… కురబ సామాజికవర్గానికి చెందినవారు.

జిల్లాలో ఆ వర్గం జనాభా బాగానే ఉండడంతో బీసీ ఓటింగ్‌ను ఆకర్షించేందుకు మాధవ్‌ను వైసీపీ బరిలో దింపే అవకాశం ఉంది.