ఆస్ట్రేలియన్ ఓపెన్ నయా క్వీన్ నవోమీ ఒసాకా

  • ఫైనల్లో పెట్రా క్విటోవా పై మూడు సెట్ల విజయం
  • 8వ సీడ్ క్విటోవా పై 7-6, 5-7 6-4 తో గెలుపు
  • విజేత ఒసాకాకు 20 కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ మహిళ ఒసాకా

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను…జపాన్ థండర్ , 4వ సీడ్ నవోమీ ఒసాకా గెలుచుకొంది. టైటిల్ తో పాటు… భారీ నగదు బహుమతి, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం కైవసం చేసుకొంది.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన ఫైనల్లో చెక్ వెటరన్, 8వ సీడ్ పెట్రా క్విటోవాను వరుస సెట్లలో ఒసాకా అధిగమించింది.

తొలి సెట్ ను టై బ్రేక్ లో 7-6తో నెగ్గిన ఒసాకా రెండోసెట్ ను 5-7తో చేజార్చుకొంది. అయితే ఆఖరి సెట్ ను 6-4తో నెగ్గడం ద్వారా…టైటిల్ తో పాటు.. 20 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని సైతం అందుకొంది.

గత ఏడాది అమెరికన్ ఓపెన్ విజేతగా నిలిచిన 20 ఏళ్ల ఒసాకా..ప్రస్తుత సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను సైతం సొంతం చేసుకొని…ఈ ఘనత సాధించిన జపాన్ తొలిమహిళగా చరిత్ర సృష్టించింది.