Telugu Global
National

పురస్కారాలకు రాజకీయ మకిలి

పురస్కారం అంటే గుర్తింపు. పురస్కారం అంటే గౌరవం. పురస్కారం అంటే పదిమందిలో ప్రత్యేకం. ఇదంతా గతం. ప్రస్తుతం పురస్కారం అంటే ఓట్లు రాబట్టుకోవడం. పురస్కారం అంటే పదవికి సోపానం. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలకు అధికారపక్షం విలువ లేకుండా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పైరవీలకు పురస్కారాలు అందజేయడం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఆ సంప్రదాయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తోంది అంటున్నారు. ప్రతి ఏటా ఇచ్చే పురస్కారాలను […]

పురస్కారాలకు రాజకీయ మకిలి
X

పురస్కారం అంటే గుర్తింపు. పురస్కారం అంటే గౌరవం. పురస్కారం అంటే పదిమందిలో ప్రత్యేకం. ఇదంతా గతం. ప్రస్తుతం పురస్కారం అంటే ఓట్లు రాబట్టుకోవడం. పురస్కారం అంటే పదవికి సోపానం.

ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలకు అధికారపక్షం విలువ లేకుండా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పైరవీలకు పురస్కారాలు అందజేయడం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఆ సంప్రదాయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తోంది అంటున్నారు.

ప్రతి ఏటా ఇచ్చే పురస్కారాలను ఈసారి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారని విమర్శకులు మండిపడుతున్నారు. దీనికి ఉదాహరణగా కేంద్రం ప్రకటించిన భారతరత్న పురస్కారాలే అంటున్నారు.

ఈ సంవత్సరం ముగ్గురికి భారతరత్న పురస్కారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడు, దివంగత నానాజీ దేశ్‌ముఖ్, అసోం కవి, గాయకుడు భూపేన్ హజారికా కూడా ఉన్నారు. వీరిద్దరికీ వారి మరణం తర్వాత భారతరత్న ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఇక హిందువుల ఓట్లు తమ వైపుకు తిప్పుకునేందుకు నానాజీ దేశ్‌ముఖ్ కు భారతరత్న లభించిందని విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా నానాజీ దేశ్‌ముఖ్ భారత రత్న ఇవ్వడానికి ప్రధాన కారణం మహారాష్ట్రలో శివసేన ప్రభావం తగ్గించేందుకేనని అంటున్నారు. వామపక్ష భావాలున్న కవి గాయకుడు భూపేన్ హజారికా కు భారతరత్న ఇవ్వడం కూడా వామపక్ష ఓట్లను తమవైపు తిప్పుకోవడం కోసమే అని విమర్శలు వస్తున్నాయి.

రానున్న ఎన్నికలలో అధికారం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విసురుతున్న తాయిలాల్లో భారతరత్న, పద్మ పురస్కారాలు కూడా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

First Published:  26 Jan 2019 3:53 AM GMT
Next Story