నిర్మాతలకి కండిషన్స్ పెడుతున్న ప్రభాస్?

ప్రభాస్ కి “బాహుబలి” సినిమాతో యమ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ప్రభాస్ ప్రస్తుతం “సాహో” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాధా క్రిష్ణ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్ట్స్ ని  ప్రభాస్ యువి క్రియేషన్స్ పైనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇక మీదట తన తదుపరి సినిమాలని కూడా ప్రభాస్ యువి క్రియేషన్స్ లోనే చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. కానీ బయట నిర్మాతలు కూడా ప్రభాస్ ని తమ ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు చెయ్యాలి అని అడుగుతున్నారట.

అయితే ఇలా తన దగ్గరకి వచ్చే నిర్మాతల దగ్గర ఒక కండిషన్ పెడుతున్నాడట ప్రభాస్. అదేంటంటే ప్రభాస్ ఎవరి ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేసినా…. యువి క్రియేషన్స్ వారినీ ఆ ప్రాజెక్టులో భాగస్వామిగా చేర్చుకోవాలని చెబుతున్నాడట. ఇలా చేస్తేనే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో నటిస్తానంటున్నాడట ప్రభాస్. మరి ప్రభాస్ పెట్టిన ఈ కండిషన్ కి బయట నిర్మాతలు ఓకే అంటారో లేదో చూడాలి.