తెలుగులో ప్రియ వారియర్ మొదటి సినిమా ఇదేనా?

నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. “మళ్ళీ రావా” ఫేం గౌతం తిన్నూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

నాని…. అర్జున్ అనే క్రికెటర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తరువాత నాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ఆరుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు.

అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మలయాళ బ్యూటీ ప్రియ వారియర్ నటించనుందట. ఇటీవలే తన “లవర్స్ డే” సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రియ వారియర్ ని…. నాని, విక్రం కే కుమార్ కలిసారట. విక్రం కే కుమార్ రాసుకున్న పాత్రకి ప్రియ వారియర్ కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి సంప్రదించాడట.

ప్రియ వారియర్ కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని అంటున్నారు. ఒకవేళ ఇదే గాని జరిగితే ప్రియ వారియర్ ఓకే చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.