Telugu Global
National

అనాథ పిల్లలకు 'మెగా' గగన విహారం

గణతంత్ర దినోత్సవం సందర్బంగా అనాథ పిల్లలకు ‘మేఘా టర్బో ఎయిర్‌ వేస్’…. ఆ చిన్నారులు కలలో కూడా ఊహించని విమానయాన అనుభవాన్ని అందించింది. పిల్లల్లో అత్మ స్థైర్యాన్ని పెంపోందించేందుకు ట్రూజెట్ “వింగ్స్ ఆఫ్ హోప్” పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని గత ఏడాదిగా నిర్వహిస్తున్నది. అనాథ పిల్లలకు విమానయానాన్ని ఉచితంగా కల్పించడంతో పాటు వారిని వివిధ దర్శనీయ స్థలాలకు తీసుకువెళ్తున్నది. ‘వింగ్స్ ఆఫ్ హోప్-3’ కార్యక్రమంలో భాగంగా చార్మినార్‌కు చెందిన ‘ఆశ్రిత రెయిన్ బో ఫౌండేషన్’, గాజుల రామారానికి […]

అనాథ పిల్లలకు మెగా గగన విహారం
X

గణతంత్ర దినోత్సవం సందర్బంగా అనాథ పిల్లలకు ‘మేఘా టర్బో ఎయిర్‌ వేస్’…. ఆ చిన్నారులు కలలో కూడా ఊహించని విమానయాన అనుభవాన్ని అందించింది. పిల్లల్లో అత్మ స్థైర్యాన్ని పెంపోందించేందుకు ట్రూజెట్ “వింగ్స్ ఆఫ్ హోప్” పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని గత ఏడాదిగా నిర్వహిస్తున్నది. అనాథ పిల్లలకు విమానయానాన్ని ఉచితంగా కల్పించడంతో పాటు వారిని వివిధ దర్శనీయ స్థలాలకు తీసుకువెళ్తున్నది.

‘వింగ్స్ ఆఫ్ హోప్-3’ కార్యక్రమంలో భాగంగా చార్మినార్‌కు చెందిన ‘ఆశ్రిత రెయిన్ బో ఫౌండేషన్’, గాజుల రామారానికి చెందిన ‘కేర్ అండ్ లవ్’ స్వచ్ఛంద సంస్థలకు చెందిన 30 మంది చిన్నారులను శనివారం ఉదయం 9.15 నిమిషాలకు ట్రూజెట్‌ విమానంలో హైదరాబాద్‌ నుంచి కడపకు తీసుకువెళ్లింది. పిల్లలంతా ఉత్సాహంగా విమాన ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేశారు.

విమానం గాలిలోకి ఎగిరే సమయంలో విమానం కిటికీల్లోంచి బయటకు చూస్తూ పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టారు. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని అనుకున్న తమ కోరికను ట్రూజెట్‌ తీర్చిందని తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి తెలిపింది. తనకు చాలా ఆనందంగా ఉందని, ఏ మాత్రం భయం వేయలేదని దుర్గాదేవి అనే మరో విద్యార్థి తెలిపింది. తొలిసారిగా విమానంలో ప్రయాణిస్తున్నందున తనకు కొంచెం భయం వేసిందని, అయితే విమానం పైకి ఎగిరిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించిందని నాలుగో తరగతి విద్యార్థి నోయెల్ తెలిపాడు.

కడప జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలకు ట్రూజెట్‌ ప్రత్యేక వాహనాల్లో ఈ పిల్లల్ని తీసుకెళ్లింది. తొలుత పుష్పగిరి ఆలయం ఆ తర్వాత గండికోటను చూపించారు. పిల్లలంతా గండికోటను చూసేందుకు అధిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అక్కడి నుంచి కడపలోని దర్గాకు తీసుకెళ్లారు. ఆధ్యాత్మిక కేంద్రాలను చిన్నారులు భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీళ్ళను తిరిగి హైదరాబాద్‌కు ట్రూజెట్‌లో తీసుకువస్తారు. విమానయానం, వసతి, భోజన సదుపాయాలతో పాటు వివిధ దర్శనీయ స్థలాల సందర్శనను కూడా ట్రూజెట్‌ ఉచితంగా ఏర్పాటు చేసింది.

‘వింగ్స్ ఆఫ్ హోప్’ కింద 300 మంది విద్యార్థులను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి 40 మంది అనాథ విద్యార్థులను కర్ణాటకలోని హంపీకి ‘వాల్మికీ ఫౌండేషన్’ సహకారంతో తీసుకు వెళ్లింది. గత ఏడాది బాలల దినోత్సవం సందర్భంగా విద్యా, విజ్ఞాన యాత్ర కోసం తమిళనాడులోని ఎస్ఆర్వీవీ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులను చెన్నై నుంచి సేలంకు ట్రూజెట్‌ తీసుకు వెళ్లింది. గత ఏడాది కేరళ వరదల సందర్భంగా కూడా బాధితులను మూడు రోజుల పాటు తిరువనంతపురం నుంచి చెన్నైకి ఉచితంగా తీసుకువచ్చింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌ నుంచి పునరావాస సామగ్రిని కేరళకు తీసుకువెళ్లింది.

ఫిబ్రవరి 13 నుంచి నాసిక్, ఇండోర్‌లకు ట్రూజెట్ విమాన సర్వీసులు

టర్బో మేఘా ఎయిర్‌ వేస్‌కు చెందిన ట్రూజెట్‌ ఫిబ్రవరి 13 నుంచి అహ్మదాబాద్ నుంచి ఇండోర్‌కు, నాసిక్‌కు విమాన సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే అహ్మదాబాద్ కేంద్రంగా పోర్ బందర్, జైసైల్మేర్ లకు విమాన సేవలను అందిస్తున్నది. హైదరాబాద్ తర్వాత అహ్మదాబాద్ ట్రూజెట్‌కు రెండవ బేస్ స్టేషన్. ట్రూజెట్‌ త్వరలో మరో రెండు ఎయిర్ క్రాఫ్ట్‌ లను ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం 5 విమానాలతో 17 మార్గాల్లో ట్రూజెట్‌ సేవలను అందిస్తోంది. విమాన కనెక్టివిటీ లేని ప్రముఖ వ్యాపార కేంద్రాలకు ట్రూజెట్‌ విమాన సేవలను ఉడాన్ పథకం కింత సర్వీసులను నడుపుతున్నది.

హైదరాబాద్, చెన్నై, ముంబై, గోవా, ఔరంగాబాద్, సేలం, మైసూర్, బళ్లారి, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, కడప, విద్యానగర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు ట్రూజెట్‌ విమాన సర్వీసులను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్‌కు విమాన సర్వీసులను నడుపుతున్న ఏకైక విమాన సంస్థ ట్రూజెట్‌ మాత్రమే.

First Published:  26 Jan 2019 6:00 AM GMT
Next Story