Telugu Global
National

భారత రత్నకు "సన్యాసి" డిమాండ్

యోగ గురువు బాబా రాందేవ్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. భారత రత్న అవార్డులను ప్రదానం చేసిన  నేపథ్యంలో స్పందించారు. దశాబ్దాలుగా సన్యాసులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. సన్యాసులకు ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 70 ఏళ్లలో భారత రత్న కోసం ఒక్క సన్యాసి కూడా కనిపించలేదా అని నిలదీశారు. భారత రత్న అవార్డును ఇప్పటి వరకు ఒక్క సన్యాసికి కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. 70 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క సన్యాసికి […]

భారత రత్నకు సన్యాసి డిమాండ్
X

యోగ గురువు బాబా రాందేవ్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. భారత రత్న అవార్డులను ప్రదానం చేసిన నేపథ్యంలో స్పందించారు.

దశాబ్దాలుగా సన్యాసులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. సన్యాసులకు ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 70 ఏళ్లలో భారత రత్న కోసం ఒక్క సన్యాసి కూడా కనిపించలేదా అని నిలదీశారు.

భారత రత్న అవార్డును ఇప్పటి వరకు ఒక్క సన్యాసికి కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. 70 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క సన్యాసికి కూడా భారత రత్న దక్కకపోవడం విచారించదగ్గ అంశమన్నారు.

మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి సహా ఎవరికీ ఈ గౌరవం దక్కలేదు. కనీసం వచ్చే ఏడాదైనా ఒక సన్యాసికి భారత రత్న ఇవ్వాలని బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. యోగా గురువుగా పేరొందిన బాబా రాందేవ్.. పతాంజలి గ్రూపు ద్వారా వేల కోట్లకు అధిపతి కూడా.

First Published:  26 Jan 2019 9:55 PM GMT
Next Story