Telugu Global
Cinema & Entertainment

అనుష్క, నయనతార.... మధ్యలో త్రిష

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈ సినిమాపై వస్తున్న కథనాలు రోజుకో రకంగా ఉంటున్నాయి. ప్రస్తుతానికైతే అనుష్క, నయనతార, త్రిష చుట్టూ గాసిప్స్ తిరుగుతున్నాయి. ఈ సినిమా ప్రకటించిన వెంటనే ముందుగా నయనతార పేరు వినిపించింది. ప్రస్తుతం చిరంజీవితో కలిసి సైరా సినిమా చేస్తున్న ఈ బ్యూటీనే మరోసారి రిపీట్ చేసే ఛాన్స్ ఉందంటూ స్టోరీలు వచ్చాయి. అయితే అంతలోనే అనుష్క […]

అనుష్క, నయనతార.... మధ్యలో త్రిష
X

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈ సినిమాపై వస్తున్న కథనాలు రోజుకో రకంగా ఉంటున్నాయి. ప్రస్తుతానికైతే అనుష్క, నయనతార, త్రిష చుట్టూ గాసిప్స్ తిరుగుతున్నాయి.

ఈ సినిమా ప్రకటించిన వెంటనే ముందుగా నయనతార పేరు వినిపించింది. ప్రస్తుతం చిరంజీవితో కలిసి సైరా సినిమా చేస్తున్న ఈ బ్యూటీనే మరోసారి రిపీట్ చేసే ఛాన్స్ ఉందంటూ స్టోరీలు వచ్చాయి. అయితే అంతలోనే అనుష్క పేరు తెరపైకి వచ్చింది.

దర్శకుడు కొరటాల శివ స్వయంగా అనుష్కతో సంప్రదింపులు జరిపాడని, కాస్త స్టోరీలైన్ కూడా వినిపించి ఆమె గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని కొంతమంది అంటున్నారు. అయితే దీనిపై కూడా క్లారిటీ రాలేదు.

ఇంతలోనే త్రిష పేరు తెరపైకి వచ్చింది. గతంలో చిరంజీవి సరసన నటించిన అనుభవం ఉండడంతో పాటు కాల్షీట్ల సమస్య కూడా ఉండదు కాబట్టి త్రిషను రిపీట్ చేయొచ్చని అంటున్నారు. మొత్తానికి వీళ్ల ముగ్గుర్లో ఒక్కరిని చిరంజీవి ఎంపిక చేయబోతున్నారన్నమాట.

First Published:  27 Jan 2019 11:12 PM GMT
Next Story