అంబేడ్కర్‌కు భారత రత్న బలవంతంగా ఇచ్చారు : ఓవైసీ వ్యాఖ్యలు

రాజ్యాంగ రచయిత బీఆర్ అంబేడ్కర్‌ కు ‘భారతరత్న’ అవార్డును బలవంతంగా ఇచ్చారని.. ఆయనకు ఆ అవార్డు మనఃస్పూర్తిగా ఇవ్వలేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

ముంబై సమీపంలోని కళ్యాణ్ నగరంలో జరిగిన వంచిత్ బహుజన్ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు భూపేన్ హజారియా, సామాజిక వేత్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటి వరకు ఎంత మంది దళితులు, పేదలు, ఆదివాసీలు, ముస్లింలు ఈ అవార్డును అందుకున్నారో చెప్పాలని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.