Telugu Global
NEWS

లక్ష్మీపార్వతిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరుతోందన్నారు. దగ్గుబాటి కుటుంబం ఇక మారేందుకు పార్టీలు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లి… ఇప్పుడు బీజేపీ నుంచి వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం పార్టీలు ఫిరాయిస్తోందన్నారు. లక్ష్మీపార్వతి పైనా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం లక్ష్మీపార్వతి […]

లక్ష్మీపార్వతిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
X

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధమవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరుతోందన్నారు.

దగ్గుబాటి కుటుంబం ఇక మారేందుకు పార్టీలు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లి… ఇప్పుడు బీజేపీ నుంచి వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం పార్టీలు ఫిరాయిస్తోందన్నారు.

లక్ష్మీపార్వతి పైనా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయిందని చంద్రబాబు మండిపడ్డారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను లక్ష్మీపార్వతి వాడుకుందని విమర్శించారు. దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరికతో అవకాశవాదులంతా ఒక గూటికి చేరినట్టు అయిందన్నారు.

ఇలాంటి వారి డొల్లతనాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలను ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. రాజమండ్రి సభ విజయవంతమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫలితాలు టీడీపీ వైపు ఏకపక్షంగా ఉంటాయనడానికి బీసీ సభకు వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు.

మోడీ, అమిత్ షాలు ఏపీకి వస్తే తీవ్ర స్థాయిలో నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అమరావతిలో ధర్మపోరాట చివరి సభ నిర్వహిస్తామన్నారు. కోల్ కతా ర్యాలీకి ధీటుగా అమరావతిలో సభ నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

First Published:  27 Jan 2019 11:52 PM GMT
Next Story