Telugu Global
Cinema & Entertainment

అది నీచమైన అబద్దం.... హీరోయిన్‌ కలగన్నట్టు ఉంది....

ఎన్టీఆర్ బయోపిక్‌ కథానాయకుడి ద్వారా విజయం అందుకోలేకపోయిన దర్శకుడు క్రిష్‌… మణికర్ణిక చిత్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మణికర్ణిక సినిమాలో 70శాతం తానే దర్శకత్వం వహించానని కంగనా రనౌత్‌ చెప్పడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. గతేడాది జూన్‌లోనే సినిమాను తాను పూర్తి చేసి అప్పగించానన్నారు. కానీ ఆ తర్వాత కొన్ని సీన్లు తొలగించి , తనకు తెలియకుండా షూట్‌ చేశారని విమర్శించారు. అతుల్‌ కులకర్ణి చేసిన యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించానని… కానీ వాటిని తొలగిద్దామంటూ కంగనా […]

అది నీచమైన అబద్దం.... హీరోయిన్‌ కలగన్నట్టు ఉంది....
X

ఎన్టీఆర్ బయోపిక్‌ కథానాయకుడి ద్వారా విజయం అందుకోలేకపోయిన దర్శకుడు క్రిష్‌… మణికర్ణిక చిత్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మణికర్ణిక సినిమాలో 70శాతం తానే దర్శకత్వం వహించానని కంగనా రనౌత్‌ చెప్పడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

గతేడాది జూన్‌లోనే సినిమాను తాను పూర్తి చేసి అప్పగించానన్నారు. కానీ ఆ తర్వాత కొన్ని సీన్లు తొలగించి , తనకు తెలియకుండా షూట్‌ చేశారని విమర్శించారు.

అతుల్‌ కులకర్ణి చేసిన యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించానని… కానీ వాటిని తొలగిద్దామంటూ కంగనా సూచించిందన్నారు. అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఆ తర్వాత ఆ సన్నివేశాలను తనకు తెలియకుండా తొలగించారని వివరించారు.

అంత కష్టపడి తాను పూర్తి చేస్తే అది బాగోలేదు, తొలగిద్దాం అన్నప్పుడు చాలా బాధేసిందన్నాడు క్రిష్. సినిమాలో 70 శాతం సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించానని కంగనా చెప్పడం… ఒక నీచమైన అబద్దమని మండిపడ్డారు. బహుశా తానే సినిమా మొత్తం తీసినట్టు కంగనా కలగని ఉంటారని ఎద్దేవా చేశాడు.

తాను తీసిన సీన్లనే కంగనా క్లోజప్‌లో షూట్‌ చేసినట్టు తనకు తెలుసన్నారు. ఆ పనికే కంగనా దర్శకురాలు అయిపోతారా? అని ప్రశ్నించారు. సోనుసూద్‌ పాత్ర చాలా బలంగా ఉందని…. కాబట్టి సీన్లు తీసేద్దామని కంగనా తనతో చెప్పిందన్నారు. అసలు సోనుసూద్‌ పాత్ర ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ఆమె ఎవరు అని ప్రశ్నించాడు క్రిష్. అయితే ఆ సినిమా యూనిట్ వాళ్ళు క్రిష్ చెప్పే మాటలను ఖండిస్తున్నారు. కొందరు కంగనాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అందుకు క్రిష్ బాధపడుతూ…. అందరూ ఈ విషయంలో కంగనాకే మద్దతు పలుకుతున్నారని క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే తాను తొలుత తీసిన మణికర్ణిక చిత్రం బంగారంలా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు చూస్తున్నది వెండి లాంటి సినిమా అని క్రిష్ వ్యాఖ్యానించాడు. ఇంత జరిగాక భవిష్యత్తులో కంగనాతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని చెప్పాడు క్రిష్.

First Published:  28 Jan 2019 2:33 AM GMT
Next Story