పంజా విసిరిన పాండ్యా….

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవడంతో పాటు ఒక దశలో వేటుకు గురైన హార్ధిక్ పాండ్యా రీఎంట్రీలో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో అద్భుతమైన ఫీల్డింగ్‌తో అబ్బుర పడిచాడు.

మెరుపు వేగంతో గాల్లో ఎగురుతూ పాండ్యా పట్టిన క్యాచ్‌… అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. గతాన్ని గతంలో కలిసేలా అభిమానుల నుంచి శభాష్ అనిపించుకున్నాడు. 17వ ఓవర్‌లో చహల్‌ బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ ముందుకు దూసుకొచ్చి బంతిని మోదాడు.

ఆ సమయంలో ఫార్వార్డ్‌ ఫీల్డింగ్‌లో ఉన్న పాండ్యా గాల్లో ఎదురుతూ దూసుకెళ్తున్న బంతిని పట్టేశాడు. దాంతో విలియమ్సన్‌ షాక్. బ్యాట్‌ను చంకలో పెట్టుకుని పెవిలియన్‌కు చేరాడు.

తొలి దశలోనే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ఆదుకునేందుకు విలియమ్సన్‌ ప్రణాళికతో ఆడుతున్న సమయంలోనే ప్యాండా పట్టిన అసాధారణ క్యాచ్ కివీస్‌ను కుంగదీసింది. నిన్నటి వరకు పాండ్యాను బూతులు తిట్టిన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ క్యాచ్ తర్వాత … పాండ్యా ఈజ్ బ్యాక్ అంటూ కితాబిస్తున్నారు.