Telugu Global
Others

షూటింగ్ స్పాట్ లో గాయపడ్డ నాని

సాధారణంగా సినిమా షూటింగ్ లో నటులు గాయపడుతుంటారు అనే విషయాల్ని మనం పదే పదే వింటుంటాం. ఇక ఆ సినిమా మొత్తం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే పక్కా ఎవరో ఒకరికి గట్టి దెబ్బలే తగులుతాయి. ఇప్పుడు హీరో నానికి కూడా అదే అయ్యింది. కానీ నాని దెబ్బ తగిలించుకుంది యాక్షన్ సినిమా వల్ల కాదు…. ఒక స్పోర్ట్స్ డ్రామా వల్ల. నాని ప్రస్తుతం “జెర్సీ” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్తి […]

షూటింగ్ స్పాట్ లో గాయపడ్డ నాని
X

సాధారణంగా సినిమా షూటింగ్ లో నటులు గాయపడుతుంటారు అనే విషయాల్ని మనం పదే పదే వింటుంటాం. ఇక ఆ సినిమా మొత్తం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే పక్కా ఎవరో ఒకరికి గట్టి దెబ్బలే తగులుతాయి.

ఇప్పుడు హీరో నానికి కూడా అదే అయ్యింది. కానీ నాని దెబ్బ తగిలించుకుంది యాక్షన్ సినిమా వల్ల కాదు…. ఒక స్పోర్ట్స్ డ్రామా వల్ల.

నాని ప్రస్తుతం “జెర్సీ” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్తి స్థాయి క్రికెట్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో నాని గాయపడ్డాడట. క్రికెట్ కి సంబంధిచిన ఒక సీక్వెన్స్ తీసే టైం లో నాని ముక్కుకి గట్టి దెబ్బ తగిలిందట. ప్రస్తుతం నాని షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. దెబ్బ నుంచి కోలుకోగానే మళ్ళీ షూటింగ్ కి వస్తాడట నాని.

“మళ్ళీ రావా” ఫేం గౌతం తిన్నూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లో శ్రద్ధ శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  28 Jan 2019 12:10 AM GMT
Next Story