Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ కి రెడీ అయిన రామ్

రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. “ఇస్మార్ట్ శంకర్” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న రామ్, పూరి…. ఈ సినిమాతో గట్టి హిట్ ని కోడతామన్న నమ్మకంతో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభ నటేష్ మరియు ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ […]

ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ కి రెడీ అయిన రామ్
X

రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. “ఇస్మార్ట్ శంకర్” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న రామ్, పూరి…. ఈ సినిమాతో గట్టి హిట్ ని కోడతామన్న నమ్మకంతో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభ నటేష్ మరియు ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ నటించనున్నారని తెలుస్తోంది.

వీరిద్దరూ మొదటి సినిమాతోనే మెప్పించినప్పటికీ సరైన హిట్లు అందుకోలేకపోయారు. ఇక ఈ సినిమాలో ఉండే ఇద్దరు హీరోయిన్స్ పాత్రలకి వీళ్ళు అయితే కరెక్ట్ అని భావించి ఛార్మి ఈ హీరోయిన్స్ ని ఓకే చేసిందట.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారిద్దరూ బెంగళూరుకు చెందిన భామలే. పూరి కనెక్ట్స్ పై పూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి మే లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.

First Published:  28 Jan 2019 2:07 AM GMT
Next Story