Telugu Global
CRIME

"నావల్లే చనిపోయింది..." మిస్టరీగా ఇద్దరు యువతుల ఆత్మహత్య

కర్నూలు శివారులోని సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజీలో…. విద్యార్థిని, హాస్టల్ వార్డెన్‌ ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. దీంతో ఆత్మహత్యలకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కాలేజీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న 17 ఏళ్ల ద్రాక్షాయని హాస్టల్‌ గదిలో తొలుత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌గా ఉన్న 22 ఏళ్ల పుష్ఫావతి … ద్రాక్షాయని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేసింది. మృతదేహాన్ని పోలీసులు […]

నావల్లే చనిపోయింది... మిస్టరీగా ఇద్దరు యువతుల ఆత్మహత్య
X

కర్నూలు శివారులోని సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజీలో…. విద్యార్థిని, హాస్టల్ వార్డెన్‌ ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. దీంతో ఆత్మహత్యలకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

కాలేజీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న 17 ఏళ్ల ద్రాక్షాయని హాస్టల్‌ గదిలో తొలుత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌గా ఉన్న 22 ఏళ్ల పుష్ఫావతి … ద్రాక్షాయని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేసింది. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా… ఆ క్షణం నుంచి వార్డెన్ పుష్పావతి కనిపించకుండా పోయింది. కొద్ది సేపటికి వార్డెన్ పుష్ఫావతి నగరంలోని ఆనంద థియేటర్ వెనుక భాగంలో ఉన్న ముళ్లపొదల వద్ద ఉరేసుకుని చనిపోయింది.

ద్రాక్షాయని

పుష్పావతి దగ్గర ఒక సూసైడ్ నోట్‌ కూడా దొరికింది. తన వల్లే ద్రాక్షాయని చనిపోయిందని అందులో రాసింది. ద్రాక్షాయని తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని ఉందని… కానీ అలా చేసినా ద్రాక్షాయని తిరిగి వచ్చే అవకాశం లేదని వాపోయింది. అందుకే తాను కూడా చనిపోతున్నానని లేఖలో రాసింది.

పుష్పావతి

హాస్టల్‌లోని మిగిలిన అమ్మాయిలు మాత్రం… ద్రాక్షాయని, పుష్పావతి ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. ఇలా ఎందుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ద్రాక్షాయని అల్సర్‌తో బాధపడుతోందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఆమె ఆహారం కూడా తీసుకోలేకపోతుందని అక్కడి విద్యార్ధులు చెబుతున్నారు.

అయితే తన వల్లే ద్రాక్షాయని చనిపోయిందని… పుష్పావతి సూసైడ్ నోట్‌ రావడంతో కారణం మిస్టరీగా మారింది. ఆ కారణాన్ని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

First Published:  27 Jan 2019 9:52 PM GMT
Next Story