ఓవర్సీస్ లో ఎఫ్2 రికార్డు

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ టాక్ తో, రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. నైజాంలో ఇప్పటికే 20 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఈ సినిమా, అటు ఓవర్సీస్ లో ఏకంగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది. యూఎస్ లో 2 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన 14వ తెలుగు సినిమాగా నిలిచింది ఎఫ్2.

ట్రేడ్ లెక్కల ప్రకారం, మరో 2 రోజులు ఇదే హవా కొనసాగితే నాన్నకు ప్రేమతో సినిమాను, మరో వీకెండ్ ఇదే ఊపు కొనసాగితే అజ్ఞాతవాసి, ఫిదా సినిమాల్ని ఇది క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మరో బడా సినిమా థియేటర్లలో లేకపోవడంతో.. ఎఫ్2 సినిమా ఓవర్సీస్ టాప్-10 మూవీస్ లిస్ట్ లోకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వస్తున్నాయి.

అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ-వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. సంక్రాంతికి హిట్ అయిన ఏకైక చిత్రం ఇదే.