Telugu Global
NEWS

ఫుట్ బాల్ కోసం పెళ్లికి 5 నిముషాల విరామం

మల్లపురం లీగ్ లో ఓ యువప్లేయర్ సంచలనం కుర్రాడి సాకర్ ప్రేమను మన్నించిన పెద్దలు చిర్రుబుర్రులాడిన అత్తింటివారు పెళ్లి…చాలామంది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే మధురఘట్టం. వివాహవేడుక కోసం కొందరు వారాలపాటు సెలవు పెట్టి… పెళ్లిపనులే జీవితం అన్నట్లుగా హడావిడి చేయటం మనకు తెలుసు. మరికొందరు మాత్రం పెళ్లిని ఓ తంతులా చూడటం ఈ మధ్యకాలంలో ఓ అంటురోగంలా తయారయ్యింది. అయితే…పెళ్లికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం పెళ్లికి ఇస్తూనే…తాము ఎంచుకొన్న వృత్తినీ ప్రేమిస్తూ..బ్యాలెన్స్ చేసుకొనేవారు మరికొందరు. ఫుట్ బాల్ ఆటే […]

ఫుట్ బాల్ కోసం పెళ్లికి 5 నిముషాల విరామం
X
  • మల్లపురం లీగ్ లో ఓ యువప్లేయర్ సంచలనం
  • కుర్రాడి సాకర్ ప్రేమను మన్నించిన పెద్దలు
  • చిర్రుబుర్రులాడిన అత్తింటివారు

పెళ్లి…చాలామంది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకొనే మధురఘట్టం. వివాహవేడుక కోసం కొందరు వారాలపాటు సెలవు పెట్టి… పెళ్లిపనులే జీవితం అన్నట్లుగా హడావిడి చేయటం మనకు తెలుసు.

మరికొందరు మాత్రం పెళ్లిని ఓ తంతులా చూడటం ఈ మధ్యకాలంలో ఓ అంటురోగంలా తయారయ్యింది. అయితే…పెళ్లికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం పెళ్లికి ఇస్తూనే…తాము ఎంచుకొన్న వృత్తినీ ప్రేమిస్తూ..బ్యాలెన్స్ చేసుకొనేవారు మరికొందరు.

ఫుట్ బాల్ ఆటే ఊపిరిగా, వృత్తిగా భావించే…కేరళలోని మల్లపురం ప్రాంతానికి చెందిన రిడ్వాన్ అనే యువకుడికి ఓ వింత సమస్య ఎదురయ్యింది. తన పెళ్లి ముహూర్తం సమయంలోనే…తన జట్టు తరపున ఓ కీలక ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. పైగా…రిడ్వాన్ ఆజట్టుకు ఆయువుపట్టులాంటి డిఫెండర్ కూడా.

పెళ్లికొడుకు దుస్తులు ధరించి వేదిక వద్దకు వచ్చిన రిడ్వాన్…ఎందుకైనా మంచిదని తన ఫుట్ బాల్ జెర్సీని సైతం వెంట తెచ్చుకొన్నాడు. ఓ వైపు పెళ్లి కార్యక్రమం ప్రారంభమైనా…మనసంతా తన జట్టు గెలుపు పైనే ఉండటంతో ఓ ఐదు నిముషాలు సమయం తనకు ఇవ్వమని పెళ్లిపెద్దలను అడిగి మరి….సాకర్ జెర్సీలో ఫుట్ బాల్ ఫీల్డ్ లోకి దిగాడు.

మల్లపురం సెవెన్ ఏ సైడ్ ఫుట్ బాల్ లీగ్ టోర్నీలో తన జట్టుకు…ఐదంటే ఐదు నిముషాల సమయంలోనే విజయం అందించి మరీ….బ్రేక్ తర్వాత నుంచి తన పెళ్లి కార్యక్రమాన్ని ముగించి వారేవ్వా అనిపించుకొన్నాడు.

పెళ్లి కార్యక్రమంలో ఐదు నిముషాల విరామం ఇవ్వటానికి పెళ్లిపెద్దలు సమ్మతించినా…రిడ్వాన్ అత్తమామలు మాత్రం…ఇదేమి పిచ్చి అంటూ వాపోయారు.

మరోవైపు…ఈ వార్త గురించి తెలుసుకొన్న కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాత్రం…కేరళ ఫుట్ బాల్ ప్లేయర్ రిడ్వాన్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఫుట్ బాల్ ను రిడ్వాన్ ఎంత అమితంగా ప్రేమిస్తున్నాడో… అంకితభావంతో ఉన్నాడో…ఈ పెళ్లిని చూస్తేనే తెలుస్తుందని…ఇది నేటితరానికి స్ఫూర్తిదాయకం కావాలంటూ ట్విట్ చేశారు.

First Published:  29 Jan 2019 10:00 AM GMT
Next Story