Telugu Global
National

పూరి గుడిసెలో ఎమ్మెల్యే నివసించడం చూడలేక ఇల్లు కట్టిస్తున్న ప్రజలు..!

ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలంటే అప్పటికే కోట్లు సంపాదించి ఉండాలి. ఒక పెద్ద భవంతి, కారు, అనుచరులు ఇలా ఎన్నో హంగులు, ఆర్భాటాలు ఉండాలి. కాని మధ్యప్రదేశ్‌లోని ఒక ఎమ్మెల్యే పూరి గుడిసెలో ఉంటున్నారు. ఆయన దీనావస్థను చూడలేక స్వయంగా నియోజకవర్గ ప్రజలే ఇల్లు కట్టివ్వాలని నిశ్చయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి సీతారామ్ ఆదివాసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు మునుపు ప్రజల్లోనే ఉంటూ […]

పూరి గుడిసెలో ఎమ్మెల్యే నివసించడం చూడలేక ఇల్లు కట్టిస్తున్న ప్రజలు..!
X

ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలంటే అప్పటికే కోట్లు సంపాదించి ఉండాలి. ఒక పెద్ద భవంతి, కారు, అనుచరులు ఇలా ఎన్నో హంగులు, ఆర్భాటాలు ఉండాలి. కాని మధ్యప్రదేశ్‌లోని ఒక ఎమ్మెల్యే పూరి గుడిసెలో ఉంటున్నారు. ఆయన దీనావస్థను చూడలేక స్వయంగా నియోజకవర్గ ప్రజలే ఇల్లు కట్టివ్వాలని నిశ్చయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి సీతారామ్ ఆదివాసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు మునుపు ప్రజల్లోనే ఉంటూ ఎంతో సేవ చేసిన అతడిని గుర్తించిన బీజేపీ.. తమ అభ్యర్థిగా ఎన్నికల్లో దింపి గెలిపించింది. అయితే ఎంతో పేదవాడైన సీతారామ్‌కు ఇప్పటికీ ఇల్లు లేదు.

ఇటీవల ఎన్నికల్లో గెలిచినప్పుడు నియోజకవర్గ ప్రజలు కరెన్సీ నాణేలతో ఆయనకు తులాభారం వేసి వాటిని ఆయనకు కానుకగా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఆయన ఒక పూరి గుడిసె వేసుకొని దాంట్లోనే భార్యతో సహా నివసిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఇంత వరకు ప్రభుత్వం నుంచి జీతం కూడా ఇవ్వక పోవడం కూడా ఆయన దీనావస్థకు కారణం.

సీతారామ్ పరిస్థితి తెలిసిన నియోజకవర్గ ప్రజలు చందాలు వేసుకొని ఆయనకు ఇల్లు కట్టివ్వాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం తలా కొంత చందా వేసుకొని ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. ఎందుకు మీరు ఎమ్మెల్యేకు ఇల్లు కడుతున్నారని అడిగితే.. -“ఆయన ఇప్పటి వరకు ఎంతో సేవ చేశారు.. అందుకే ఆయన కోసం ఈ చిన్ని సాయం చేస్తున్నామని” ప్రజలు చెప్పారు.

ఇదే విషయమై సీతారామ్‌ను సంప్రదించగా.. నా ప్రజలు నాకు ఇల్లు కట్టివ్వడం ఆనందంగా ఉంది. నాకు జీతం వచ్చాక ఆ డబ్బును మా నియోజకవర్గం ప్రజలకే ఉపయోగిస్తానని గర్వంగా చెప్పారు.

First Published:  29 Jan 2019 8:48 AM GMT
Next Story