Telugu Global
Cinema & Entertainment

పార్ట్-1 లో మిస్ అయింది.... పార్ట్-2 లో వర్క్ అవుట్ చేస్తారట..!

నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి మీద బయోపిక్ తీయగానే… సూపర్ డూపర్ హిట్ అవుతుందని బాగా ప్రమోషన్ చేశారు. కానీ సినిమాలో ఎమోషన్ అనేది వర్క్ అవుట్ అవ్వక “ఎన్టీఆర్” కథానాయకుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేసిన క్రిష్ కూడా ఫ్లాప్ పై స్పందించలేదు. ఇక ఈ డైరెక్టర్ తదుపరి శ్రద్ధ మొత్తం ఎన్టీఆర్ మహానాయకుడు మీదే పెట్టాడట. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో […]

పార్ట్-1 లో మిస్ అయింది.... పార్ట్-2 లో  వర్క్ అవుట్ చేస్తారట..!
X

నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి మీద బయోపిక్ తీయగానే… సూపర్ డూపర్ హిట్ అవుతుందని బాగా ప్రమోషన్ చేశారు. కానీ సినిమాలో ఎమోషన్ అనేది వర్క్ అవుట్ అవ్వక “ఎన్టీఆర్” కథానాయకుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.

ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేసిన క్రిష్ కూడా ఫ్లాప్ పై స్పందించలేదు. ఇక ఈ డైరెక్టర్ తదుపరి శ్రద్ధ మొత్తం ఎన్టీఆర్ మహానాయకుడు మీదే పెట్టాడట.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో క్రిష్ మరిన్ని ఎమోషనల్ సీన్స్ జత చేయాలని బాలక్రిష్ణ కి సూచించాడట. ఎందుకంటే మొదటి భాగం లో ఏదైతే ఎమోషన్ మిస్ అయ్యిందో అది రెండవ భాగంలో వర్క్ అవుట్ చెయ్యాలి అనేది క్రిష్ ఉద్దేశమట.

మరి ఇప్పటికీ జనాల్లో “మహానాయకుడు” సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. మరి క్రిష్ ఎలాంటి సీన్స్ జత చేసి… ఎలాంటి ట్రైలర్ కట్ చేసి…. ఈ “మహానాయకుడు” సినిమాకి హైప్ తీసుకొస్తాడో చూడాలి. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

First Published:  29 Jan 2019 3:17 AM GMT
Next Story