శ్రీదేవి బయోపిక్ పై రకుల్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల కంటే…. బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.

ఇప్పటి దాకా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమెను ఎలాంటి పాత్రల్లో నటించాలని ఉంది అని అడగగా…. రకుల్ ప్రీత్ సింగ్ తనకు శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఉందని చెప్పింది.

అయితే ఈమధ్యే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని, శ్రీదేవి బయోపిక్ తీస్తే అందులో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

మరి ఇప్పుడు ఎవరైనా శ్రీదేవి బయోపిక్ తీయాలనుకుంటే రకుల్ ప్రీత్ కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

అయితే ఇప్పుడు రకుల్ చేతిలో సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్ జి కే’ సినిమా మరియు కార్తీ హీరోగా నటించిన ‘దేవ్’ సినిమాలు ఉన్నాయి. కార్తీ నటించిన ‘దేవ్’ సినిమా తెలుగు లో అదే టైటిల్ తో విడుదల కానుంది.