Telugu Global
NEWS

సిక్సర్ల బాదుడులో ధోనీ సరసన రోహిత్ శర్మ

న్యూజిలాండ్ పై రోహిత్ శర్మ రికార్డులే రికార్డులు 10వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ సెంచరీ భాగస్వామ్యాలలోనూ రోహిత్ జోరు న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో…టీమిండియా ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా …మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చోటు సంపాదించాడు. మౌంట్ మాగునీలోని బే ఓవల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ రెండు […]

సిక్సర్ల బాదుడులో ధోనీ సరసన రోహిత్ శర్మ
X
  • న్యూజిలాండ్ పై రోహిత్ శర్మ రికార్డులే రికార్డులు
  • 10వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ
  • సెంచరీ భాగస్వామ్యాలలోనూ రోహిత్ జోరు

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో…టీమిండియా ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా …మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చోటు సంపాదించాడు.

మౌంట్ మాగునీలోని బే ఓవల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…తన సిక్సర్ల సంఖ్యను 215కు పెంచుకొన్నాడు. ధోనీ తన కెరియర్ లో ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ ఆడిన 337 మ్యాచ్ ల్లో 215 సిక్సర్లు బాదాడు.

ఓవరాల్ గా ధోనీకి 222 సిక్సర్లు సాధించిన రికార్డు ఉంది. ఇందులో ఆసియాలెవెన్ జట్టు తరపున ఆడిన సమయంలో ధోనీ సాధించిన ఏడు సిక్సర్లు సైతం ఉన్నాయి. టీమిండియా తరపున ధోనీ సాధించిన 215 సిక్సర్ల రికార్డును …రోహిత్ శర్మ మూడో వన్డేతో సమం చేయగలిగాడు.

కివీ పేసర్ ఫెర్గూసన్ బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా రోహిత్ తన సిక్సర్ల సంఖ్యను 215కు పెంచుకోగలిగాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్ల మొనగాళ్లలో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

ధోనీ, రోహిత్ సంయుక్త అగ్రస్థానంలో నిలిస్తే…సచిన్ 195 సిక్సర్లతో రెండు, సౌరవ్ గంగూలీ 185 సిక్సర్లతో మూడు, యువరాజ్ సింగ్ 153 సిక్సర్లతో మూడు స్థానాలలో ఉన్నారు.

అత్యంత వేగంగా 10వేల పరుగుల క్లబ్ లో…

రోహిత్ శర్మ సిక్సర్లు బాదుడులో మాత్రమే కాదు…అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని చేరిన భారత పదవ క్రికెటర్ గా కూడా రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ 10 వేల పరుగులను 260 ఇన్నింగ్స్ లో సాధించగలిగాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 219 ఇన్నింగ్స్ లో, సౌరవ్ గంగూలీ 252 ఇన్నింగ్స్ లో, మాస్టర్ సచిన్ 257 ఇన్నింగ్స్ లో 10 వేల పరుగులు సాధించగలిగారు.

సెంచరీ భాగస్వామ్యాల రికార్డు….

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో సహఓపెనర్ శిఖర్ ధావన్ తో కలసి రోహిత్ శర్మ ..మొదటి వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్ ల పేరుతో ఉన్న రికార్డును రోహిత్-ధావన్ జోడీ అధిగమించారు.

సచిన్- వీరూ జోడీ 114 ఇన్నింగ్స్ లో సాధించిన 13 సెంచరీ స్టాండ్ ల రికార్డును…కేవలం 95 ఇన్నింగ్స్ లోనే రోహిత్- ధావన్ జంట అధిగమించడం విశేషం.

సచిన్-వీరూ రికార్డు తెరమరుగు….

భారత క్రికెట్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు సచిన్- సౌరవ్ గంగూలీ జోడీ పేరుతో ఉంది. ఈ ఇద్దరూ 26 సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయటం విశేషం. 2013 సీజన్లో తొలిసారిగా రోహిత్- ధావన్ జోడీ టీమిండియా వన్డే ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి నిలకడగా రాణిస్తూ పరుగుల మోత మోగిస్తూ వస్తున్నారు.

ప్రస్తుత సిరీస్ రెండో వన్డేలో ఈ ఇద్దరూ కేవలం 25.2 ఓవర్లలోనే 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ 96 బాల్స్ లో 3 సిక్సర్లు, 9 బౌండ్రీలతో 87 పరుగులు, శిఖర్ ధావన్ 67 బాల్స్ లో 9 బౌండ్రీలతో 66 పరుగులు సాధించి అవుటయ్యారు.

విరాట్ కొహ్లీతో కలసి….

న్యూజిలాండ్ తో బే ఓవల్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో కెప్టెన్ విరాట్ కొహ్లీ తో కలసి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ…రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టాడు.

రెండో వికెట్ కు 105 బాల్స్ లోనే ఈ జోడీ వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ 63 బాల్స్ లో మూడు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ, కెప్టెన్ కొహ్లీ 59 బాల్స్ లో ఓ సిక్సర్, 5 బౌండ్రీలతో అర్థశతకం పూర్తి చేశారు.

రోహిత్ 62, కొహ్లీ 60 పరుగుల స్కోర్లకు ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు. వన్డే ల్లో రోహిత్- విరాట్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయటం ఇది 16వసారి కావటం విశేషం.

భారత వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు…మాస్టర్ సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ పేరుతో ఉంది. ఈ ఇద్దరూ మొత్తం 26 సెంచరీ భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

First Published:  29 Jan 2019 5:02 AM GMT
Next Story