Telugu Global
NEWS

ఖజానా ఖాళీ.... మార్చి వరకు లాగుతాం.... అంతే....

ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అవుతోంది. క్రమశిక్షణ లేని ఆర్ధిక నిర్వాహణ కారణంగా ఏపీ మరోసారి ముప్పు అంచున నిలబడింది. ఆర్ధిక శాఖ అధికారులు దాదాపు చేతులెత్తేశారు. మార్చి వరకు బండి లాగుతామంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటో చెప్పలేమంటున్నారు. తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి అన్న దానికి సమాధానం లేదు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు హఠాత్తుగా భారీ పథకాలు ప్రకటించడంతో ఆర్ధిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎన్నికల తర్వాత సంగతేమో గాని… ఈరెండు నెలలు బండి […]

ఖజానా ఖాళీ.... మార్చి వరకు లాగుతాం.... అంతే....
X

ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అవుతోంది. క్రమశిక్షణ లేని ఆర్ధిక నిర్వాహణ కారణంగా ఏపీ మరోసారి ముప్పు అంచున నిలబడింది. ఆర్ధిక శాఖ అధికారులు దాదాపు చేతులెత్తేశారు. మార్చి వరకు బండి లాగుతామంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటో చెప్పలేమంటున్నారు.

తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి అన్న దానికి సమాధానం లేదు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు హఠాత్తుగా భారీ పథకాలు ప్రకటించడంతో ఆర్ధిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎన్నికల తర్వాత సంగతేమో గాని… ఈరెండు నెలలు బండి లాగడం ఎలా అన్న దానిపై ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది.

ఇప్పటికే రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. ఫిబ్రవరి ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలిన సొమ్ముతో బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒక ఫిబ్రవరి నెలలోనే 30 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ ఇప్పటికే ఏపీ పరపతి దెబ్బతినడంతో అంత మొత్తంలో అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు రావడం లేదు.

పైగా ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పును ఉత్పాదక రంగంలో కాకుండా… ఓటర్లను ఆకర్షించేందుకు వాడబోతుండడం కూడా అప్పు పుట్టకపోవడానికి ప్రధాన కారణంగా మారింది.

ఇప్పటికిప్పుడు రైతు రుణమాఫికి 8వేల కోట్లు, పెండింగ్‌ బిల్లులకు 2.5వేల కోట్లు, పెంచిన పించన్ల చెల్లింపుకు 1800 కోట్లు కావాలి. డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ కింద అప్పుగా మూడు విడతల్లో మూడు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు కూడా భారీగా సొమ్ము కావాలి.

ఇలా ఎన్నికల్లో గట్టెక్కేందుకు చంద్రబాబు ప్రకటించిన తాయిలాల కారణంగా, ఇప్పటికే మోయలేని భారమైన అప్పుల కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నెలనెల గండంగా మారింది.

First Published:  29 Jan 2019 11:15 PM GMT
Next Story