నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సందర్శకులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

భీకరంగా అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. షార్ట్ సర్క్యూట్ జరిగిన దుకాణమే కాకుండా పక్క షాపులకు కూడా మంటలు అతి వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం 6 ఫైరింజన్లు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఈ మంటల్లో ఎంత మంది చిక్కుకున్నారనే విషయం తెలియరాలేదు. మంటలు ప్రారంభమైన సమయంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 40 వేల మంది సందర్శకులు ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.