Telugu Global
Cinema & Entertainment

మహేష్ కోసం భారీ ప్రసంగం సిద్ధం

సినిమాలు చేసే మహేష్ కు ప్రసంగంతో సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? సంబంధం ఉంది. అది కూడా సినిమా సంబంధమే. అవును.. ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమాలో మహేష్ భారీ ప్రసంగం ఉంటుందట. అది కూడా ఎంతో భావోద్వేగంతో కూడి ఉంటుందట. ఇక మేటర్ లోకి వెళ్దాం.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా మహేష్ ఇందులో కనిపించబోతున్నాడు. ఇంటర్వెల్ కు ముందు ఓ భారీ ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ తర్వాత […]

మహేష్ కోసం భారీ ప్రసంగం సిద్ధం
X

సినిమాలు చేసే మహేష్ కు ప్రసంగంతో సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? సంబంధం ఉంది. అది కూడా సినిమా సంబంధమే. అవును.. ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమాలో మహేష్ భారీ ప్రసంగం ఉంటుందట. అది కూడా ఎంతో భావోద్వేగంతో కూడి ఉంటుందట. ఇక మేటర్ లోకి వెళ్దాం..

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా మహేష్ ఇందులో కనిపించబోతున్నాడు. ఇంటర్వెల్ కు ముందు ఓ భారీ ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ తర్వాత రైతుల బాధలు, ఆత్మహత్యల గురించి మహేష్ భావోద్వేగంతో దాదాపు 7 నిమిషాలు మాట్లాడే సీన్ ఉందట. సినిమాకు టర్నింగ్ పాయింట్ అదే సీన్ అంటున్నారు.

మహేష్ వ్యవసాయానికి సంబంధించిన సన్నివేశాల్ని పొలాచ్చిలో చిత్రీకరించారు. బ్యాలెన్స్ సీన్స్ ను హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో తీయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ నెలాఖరుకు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  30 Jan 2019 10:38 AM GMT
Next Story