Telugu Global
NEWS

టిమిండియా ఘోర పరాజయం

వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న కోహ్లి సేన నాలుగో వన్డేలో మాత్రం చతికిలపడింది. ఘోర పరాజయాన్ని సొంతం చేసుకుంది. హామిల్టన్‌ వన్డేలో న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 93 పరుగుల సులువైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి గెలుపుతీరం చేరింది. 14. 4 ఓవర్లకే 93 పరుగులు సాధించింది కివీస్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ ఏ దశలోనూ కివీస్‌ బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. 92 పరుగులకే […]

టిమిండియా ఘోర పరాజయం
X

వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న కోహ్లి సేన నాలుగో వన్డేలో మాత్రం చతికిలపడింది. ఘోర పరాజయాన్ని సొంతం చేసుకుంది.

హామిల్టన్‌ వన్డేలో న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 93 పరుగుల సులువైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి గెలుపుతీరం చేరింది. 14. 4 ఓవర్లకే 93 పరుగులు సాధించింది కివీస్.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ ఏ దశలోనూ కివీస్‌ బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. 92 పరుగులకే టిమిండియా ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ నుంచి చాహల్‌ చేసిన 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్. పాండ్యా 16 పరుగులు, కుల్దీప్ 15, ధావన్‌ 13 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లు తీశాడు. గ్రాన్డ్‌హోమె 3, ఆస్ట్‌లే, నీషమ్‌లు చెరో వికెట్‌ తీశారు.

First Published:  31 Jan 2019 12:24 AM GMT
Next Story