Telugu Global
Cinema & Entertainment

విజయ్, తరుణ్ సినిమా పై.... స్పందించిన అనసూయ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ “నోటా” సినిమా ద్వారా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కింగ్ అఫ్ హిల్ అని పెట్టుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక చిన్న సినిమాకు ప్రొడ్యూస్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. “పెళ్ళి చూపులు” సినిమాతో విజయ్ కి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమా ద్వారా హీరోగా మారుతున్నాడు. ఇక ఈ సినిమాలో తరుణ్ […]

విజయ్, తరుణ్ సినిమా పై.... స్పందించిన అనసూయ
X

యంగ్ హీరో విజయ్ దేవరకొండ “నోటా” సినిమా ద్వారా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కింగ్ అఫ్ హిల్ అని పెట్టుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక చిన్న సినిమాకు ప్రొడ్యూస్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. “పెళ్ళి చూపులు” సినిమాతో విజయ్ కి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమా ద్వారా హీరోగా మారుతున్నాడు.

ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన హాట్ యాంకర్ అనసూయ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ న్యూస్ పై స్పందించింది అనసూయ.

ఈ సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాది చాలా ముఖ్య పాత్ర, అలా అని అందాల ప్రదర్శన అస్సలు చెయ్యను. ఈ క్యారెక్టర్ లో అలాంటి వాటికి అస్సలు స్కోప్ లేదు. విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా తరుణ్ భాస్కర్ పక్కన నటించడం నిజంగా చాలా మంచి ఫీల్. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు” అని చెప్పుకొచ్చింది ఈ బుల్లితెర హాట్ బ్యూటీ.

First Published:  31 Jan 2019 2:30 AM GMT
Next Story