విషవాయువులతో బ్యాంకాక్‌ ఉక్కిరి బిక్కిరి

ప్రపంచ దేశాల పర్యాటకులకు బ్యాంకాక్‌ ఒక భూతల స్వర్గం. ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ కు వెళుతుంటారు. ఇప్పుడు ఆ దేశంలో కూడా వాతావరణ కాలుష్యం అంతులేకుండా పెరిగిపోయింది. దాంతో స్వచ్ఛమైన గాలి కూడా కరువైంది. ముఖ్యంగా బ్యాంకాక్‌ నగర వాతావరణంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగిపోయింది.

మంగళవారం నుంచి బ్యాంకాక్‌ నగరంలో విషవాయువులు ప్రమాదకర స్థాయిలో వ్యాపించడంతో ప్రభుత్వం అప్రమత్తమై నగరంలోని విద్యాసంస్థలన్నింటికి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే చిన్నారులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు పాఠశాలలకు వెళితే తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి నుంచే బయటకు పంపించడం లేదు.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విఫలం అయినందు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రధాని ప్రకటించాడు.