Telugu Global
National

సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై రేపు సమావేశం

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సంబంధించిన కొత్త రెగ్యులర్ డైరెక్టర్‌ను నియమించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఫిబ్రవరి 1న సమావేశం కానుంది. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీలోని సభ్యుడైన మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడించారు. జనవరి 24న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అర్హులైన అధికారుల రికార్డులను ఈ కమిటీ పరిశీలించినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజే సీబీఐ డైరెక్టర్ నియామకానికి మరో సారి సమావేశం కావాలని నిర్ణయించారు. […]

సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై రేపు సమావేశం
X

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సంబంధించిన కొత్త రెగ్యులర్ డైరెక్టర్‌ను నియమించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఫిబ్రవరి 1న సమావేశం కానుంది. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీలోని సభ్యుడైన మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడించారు.

జనవరి 24న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అర్హులైన అధికారుల రికార్డులను ఈ కమిటీ పరిశీలించినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజే సీబీఐ డైరెక్టర్ నియామకానికి మరో సారి సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 1న తుది సమావేశం కానుంది.

ఫిబ్రవరి 1 సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్, కాంగ్రెస్ నేత ఖర్గేలతో కూడిన కమిటీ సీబీఐ కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేయనుంది. గత సమావేశంలో చర్చించిన నలుగురు ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పూర్తి సమాచారం కమిటీకి అందనుంది. వారి గత చరిత్ర, అనుభవం ప్రాతిపదికన కొత్త సీబీఐ డైరెక్టర్‌ను నియమించనున్నారు.

First Published:  30 Jan 2019 8:21 PM GMT
Next Story