Telugu Global
National

చందాకొచ్చార్ తప్పు చేసిందని తేల్చిన ఐసీఐసీఐ.... బోనస్ వెనక్కు !

దేశీయ బ్యాంకింగ్ రంగంలో శక్తివంతమైన సీఈవోగా పేరు గడించిన చందా కొచ్చార్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా అర్థాంతరంగా రాజీనామా చేసి వెళ్లిన చందాపై జరిపిన అంతర్గత విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. వీడియోకాన్ – ఐసీఐసీఐ బ్యాంకు స్కాంలో చందా కొచ్చార్‌కు సంబంధం ఉన్నట్లు మాజీ న్యాయమూర్తి జస్టీస్ బీఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలోని విచారణ కమిటి తమ నివేదికలో వెల్లడించింది. స్వప్రయోజనాల విషయంలో కొచ్చార్ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని, విధివిధానాలను ఉల్లంఘించారని పేర్కొంది. […]

చందాకొచ్చార్ తప్పు చేసిందని తేల్చిన ఐసీఐసీఐ.... బోనస్ వెనక్కు !
X

దేశీయ బ్యాంకింగ్ రంగంలో శక్తివంతమైన సీఈవోగా పేరు గడించిన చందా కొచ్చార్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా అర్థాంతరంగా రాజీనామా చేసి వెళ్లిన చందాపై జరిపిన అంతర్గత విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి.

వీడియోకాన్ – ఐసీఐసీఐ బ్యాంకు స్కాంలో చందా కొచ్చార్‌కు సంబంధం ఉన్నట్లు మాజీ న్యాయమూర్తి జస్టీస్ బీఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలోని విచారణ కమిటి తమ నివేదికలో వెల్లడించింది. స్వప్రయోజనాల విషయంలో కొచ్చార్ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని, విధివిధానాలను ఉల్లంఘించారని పేర్కొంది.

తన భర్త భాగస్వామిగా ఉన్న సంస్థకు 3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేయడంలో ఆమె క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్టు స్పష్టం కావడంతోనే ఆమె రాజీనామా చేసినట్లు ఆ నివేదికలో పొందు పర్చారు.

ఉన్నత స్థాయి కమిటీలో ఆమె దోషిగా తేలడంతో ఆమెకు రావలసిన బోనస్‌తో సహా ఇతర ప్రయోజనాలకు సంబంధించిన చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఐసీఐసీఐ వెల్లడించింది.

First Published:  30 Jan 2019 8:39 PM GMT
Next Story