Telugu Global
NEWS

ఎమ్మెల్యేల అవినీతి పై చంద్రబాబు వార్నింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం చంద్రబాబు నాయుడి బెదిరింపులు, గద్దింపులు, ఖబడ్దార్‌‌లతో సాగింది. శుక్రవారం నుంచి 12 రోజుల పాటు ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టనున్న పలు అంశాలపై చర్చించేందుకు సమావేశమైన తెలుగుదేశం శాసనసభా పక్షం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహావేశాలతో ఊగిపోయిందట. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నానాటికీ దిగజారుతున్న స్థితిపై అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరిపైనా […]

ఎమ్మెల్యేల అవినీతి పై చంద్రబాబు వార్నింగ్‌
X

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం చంద్రబాబు నాయుడి బెదిరింపులు, గద్దింపులు, ఖబడ్దార్‌‌లతో సాగింది. శుక్రవారం నుంచి 12 రోజుల పాటు ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టనున్న పలు అంశాలపై చర్చించేందుకు సమావేశమైన తెలుగుదేశం శాసనసభా పక్షం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహావేశాలతో ఊగిపోయిందట. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నానాటికీ దిగజారుతున్న స్థితిపై అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరిపైనా సీరియస్ అయ్యారని సమాచారం.

శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు, రాయలసీమ లోని అన్ని జిల్లాల కు పాకిన అవినీతి పై సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరిని చంద్రబాబు కడిగిపారేశారు అంటున్నారు. తానొక్కడినే కష్టపడి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురా లేనని, అందరూ సమిష్టిగా పనిచేస్తేనే తిరిగి అధికారంలోకి రావడం జరుగుతుందని బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
“మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడ ఎక్కడ ఎంత మేరకు అవినీతి చేశారో నా దగ్గర లెక్కలున్నాయి. జాగ్రత్త ఈ మూడు నెలలు కష్టపడితే తిరిగి అధికారంలోకి వస్తాం. లేకపోతే ఇంటికి వెళ్లి పోవాల్సిందే.” అని కాసింత కటువుగానే చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఎవరెవరు ఎంత సంపాదించారో సమాచారం ఆయన దగ్గర ఉంటే ఆ లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనాలకు ఎవరు ఎంత పంచాలో ఆయనే చెబుతారా? అని కొందరు గుసగుసలాడినట్లు సమాచారం.

సిట్టింగ్‌లలో సగానికి సగం మందికి టిక్కెట్లు వచ్చే అవకాశం లేదని, వారిని పార్టీ పనుల కోసం ఉపయోగించుకుంటామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. నియోజక వర్గాల వారీగా చేసిన సర్వేల ప్రకారం టికెట్లు ఇస్తామని, మిగిలినవారు వారికి సహకరించాల్సిందేనని టీడీఎల్పీ సమావేశంలో బాబు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ప్రతిపక్షాల నుంచి కొందరు సీనియర్ నాయకులు తెలుగుదేశం లో చేరేందుకు ముందుకు వస్తున్నారని, అలాంటి వారిని ఆయా జిల్లాలలో ఉన్న సీనియర్ నాయకులు ఆహ్వానించాలి తప్ప.. వారితో వివాదాలు పెట్టుకోరాదని చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఉపముఖ్యమంత్రి కెఇ. క్రిష్ణమూర్తిని ఉద్దేశించి అన్నవేనని పార్టీలో సీనియర్ నేతలు అంటున్నారు. ప్రతిపక్షం శాసనసభకే రానప్పుడు సభలో వ్యవహరించాల్సిన తీరుపై టిడిఎల్పి సమావేశం అవసరం లేదని వారి అభిప్రాయం. కేవలం శాసనసభ్యులను హెచ్చరించేందుకే టిడిఎల్పి సమావేశం నిర్వహించారని మెజారిటి శాసనసభ్యులు అంటున్నారు.

First Published:  31 Jan 2019 5:20 AM GMT
Next Story