Telugu Global
NEWS

సైకిల్‌ స్టాండ్‌ లెక్క కుప్పకూలిన టీమిండియా....

కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ మొదటి మూడు మ్యాచ్‌ లలో అదరగొట్టిన టిమిండియా మూడో మ్యాచ్‌లో మాత్రం సునాయాసంగా చేతులెత్తేసింది. మూడంకెల స్కోర్ కూడా చేయలేక హామిల్టన్ వన్డేలో టిమిండియా బ్యాంటింగ్ కుప్పకూలింది. సైకిల్‌ స్టాండ్‌ తరహాలో ఒక వికెట్ తర్వాత మరొ వికెట్ ఫటఫటమంటూ రాలిపోయాయి. కివీస్ బౌలర్ల ధాటికి కేవలం 92 పరుగులకే భారత్ అలౌట్ అయింది. 93 పరుగుల సులువైన విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ నుంచి చాహల్‌ […]

సైకిల్‌ స్టాండ్‌ లెక్క కుప్పకూలిన టీమిండియా....
X

కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ మొదటి మూడు మ్యాచ్‌ లలో అదరగొట్టిన టిమిండియా మూడో మ్యాచ్‌లో మాత్రం సునాయాసంగా చేతులెత్తేసింది. మూడంకెల స్కోర్ కూడా చేయలేక హామిల్టన్ వన్డేలో టిమిండియా బ్యాంటింగ్ కుప్పకూలింది.

సైకిల్‌ స్టాండ్‌ తరహాలో ఒక వికెట్ తర్వాత మరొ వికెట్ ఫటఫటమంటూ రాలిపోయాయి. కివీస్ బౌలర్ల ధాటికి కేవలం 92 పరుగులకే భారత్ అలౌట్ అయింది. 93 పరుగుల సులువైన విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ నుంచి చాహల్‌ చేసిన 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్. పాండ్యా 16 పరుగులు, కుల్దీప్ 15, ధావన్‌ 13 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లు తీశాడు. గ్రాన్డ్‌హోమె 3, ఆస్ట్‌లే, నీషమ్‌లు చెరో వికెట్‌ తీశారు.

First Published:  31 Jan 2019 9:00 AM GMT
Next Story